ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు జనం ఆరోగ్యకరమైన ఆహారం దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం పండ్లతో చేసే జ్యూస్‌లు, షేక్‌లు, స్మూతీల్లాంటివి రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. వీటన్నింటినీ సులభంగా చేసుకునేందుకు వండర్ షెఫ్ సంస్థ ‘మాగ్నెటో బ్లెండర్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
దీంతో పాటు గ్లాసులా ఉండే చిన్న, పెద్ద జార్లు వస్తాయి. వీటికి మూత పెట్టి బ్లెండర్లో పెడితే అయస్కాంతం సాయంతో అది సరైన పొజిషన్లో ఫిక్స్ అవుతుంది. తర్వాత అక్కడ ఉండే బటన్ల సాయంతో మనకు కావలసినంత స్పీడ్‌తో జార్‌ను తిప్పుకోవచ్చు. పూర్తవగానే నేరుగా తాగొచ్చు. బ్యాగులో పెట్టుకుని మనతో పాటు తీసుకెళ్లొచ్చు. ఈ జార్లతో పాటు ఒక సిప్పర్ మూత కూడా ఇస్తారు. మన అవసరాన్ని బట్టి ఏదో ఒకటి వాడుకోవచ్చు. వేరే బ్లెండర్లతో పోలిస్తే శబ్దం తక్కువ వచ్చేలా, పిల్లలు కూడా సులభంగా వాడగలిగేలా దీన్ని రూపొందించారు. wonderchef.com లో దొరికే దీని ఖరీదు 6,999 రూపాయలు.