కేటీఆర్ మాటలే స్ఫూర్తి.. యాప్‌ను రూపొందించి
చాలామంది నేతలు.. యువత కనిపిస్తే చాలు రాజకీయాలు మాట్లాడుతారు. ఈ విషయంలో కేటీఆర్ రూటే సెపరేట్. ఆయన మాటలు యువతలో కొత్త ఆలోచనలకు అంకురార్పణ చేస్తాయి. కేటీఆర్ నుంచి అలాంటి స్ఫూర్తినే పొందాడు 30 ఏండ్ల నల్లి ఉమామహేశ్వర రావు. వారి మాటలే ప్రేరణగా క్రీడాకారుల కోసం సహచర కోచ్‌తో కలిసి ఓ యాప్ రూపకల్పన చేశాడు. క్రీడాకారులకు, కోచ్‌లకు, అకాడమీలకు అనుసంధానంగా నిలుస్తున్న ‘చలో’ యాప్ పనితీరుపై ఉమా మహేశ్వర రావు బతుకమ్మతో పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే..
ప్రతి ఒక్కరిలోనూ ఆలోచించే తత్వం ఉంటుంది. అలాంటి ఆలోచనలకు కొన్ని స్ఫూర్తిదాయక మాటలు బీజం వేస్తాయి. నా విషయంలోనూ అదే జరిగింది. మాది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటినుంచి చదువుకంటే ఆటలంటేనే ఎక్కువ ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు మా పీఈటీ సార్ నా ఆసక్తిని గమనించి బ్యాడ్మింటన్ నేర్పించారు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు నాకిష్టమైన బ్యాడ్మింటన్‌లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాను. జాతీయ క్రీడలకు సైతం ఎంపికయ్యాను. డిగ్రీ పూర్తి చేయడంతోనే బ్యాడ్మింటన్ కోచ్ అవతారమెత్తి కొన్నాళ్లు ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాను. తర్వాత బెంగళూరు ఎన్ఐఎస్లో శిక్షణ తీసుకున్నాను. 2021లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో కోచ్‌గా చేరాను.
రిఫర్ చేయమనేవారు
ఇందులో కోచ్‌గా రాణిస్తున్న సమయంలోనే మధ్యప్రదేశ్‌కు చెందిన మరో కోచ్ మయూర్ చౌహాన్‌తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే మేము మంచి మిత్రులుగా మారాం. మా ఇద్దరికీ భవిష్యత్తులో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉండేది. దానిమీదే కసరత్తు చేయడం ప్రారంభించాం. ఇదే సమయంలో నా దగ్గరికి వచ్చే క్రీడాకారులంతా అకాడమీ సమయంలో కాకుండా తమకు అదనపు సమయంలోనూ క్రీడలు నేర్పించే కోచ్‌లు ఉంటే రిఫర్ చేయమని అడుగుతుండేవారు. మరోవైపు నా మిత్రుల్లో కొంతమంది బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్లు కూడా అకాడమీలో కోచ్ పోస్టులు ఖాళీలు ఏమైనా ఉంటే రిఫర్ చేయమనేవారు. వీరిద్దరి సమస్యలు తెలుసు! కానీ, దానికి పరిష్కారం మాత్రం ఆ సమయంలో నా దగ్గర లేదు. భవిష్యత్తులో అదనపు ట్రైనింగ్‌కోసం మేమే ఓ అకాడమీ పెట్టాలనే ఆలోచన మాత్రం చేశాం! కానీ, అది ఇప్పట్లో సాధ్యం కాదని కూడా మాకు తెలుసు. అందుకే మా ప్రయత్నాలు ఆలోచనలకే పరిమితమయ్యాయి.

Uma Maheswara Rao And Mayur
బీజం పడింది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రతి మాట కూడా ఇన్నోవేటివ్‌గా ఉంటుంది. ఏడాది క్రితం కేటీఆర్ ఓ కార్యక్రమంలో యువతతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ సమయంలో ఊబర్ ఎలా ప్రారంభమైందో చెప్పిన తీరు నా ఆలోచనకు బీజం వేసింది. ప్రతి అవసరం నుంచి ఆలోచన పుడుతుందనే కేటీఆర్ మాటల్లోని అర్థం నా యాప్ రూపకల్పనకు తోడైంది. ప్రతిదీ ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో లభించినప్పుడు క్రీడాకారులు కూడా తమకు నచ్చిన కోచ్‌ను ఎంపిక చేసుకోవచ్చు కదా అని అనిపించింది. దాంతోపాటు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న కోచ్‌లకు ఇది చక్కటి అవకాశంలా పనికొస్తుందని భావించి రూ.6 లక్షలు ఖర్చుపెట్టి నేను, మయూర్ చౌహాన్ కలిసి ‘చలో లెట్స్ లెర్న్ స్పోర్ట్స్’ యాప్ రూపొందించాం. మా ఆలోచనకు ప్రేరణనిచ్చిన కేటీఆర్‌తోనే లాంచ్ చేయించాలనుకున్నాం! కానీ, సమయం అనుకూలించకపోవడంతో ఈ ఏడాది మే నెలలో ఓ దేవాలయంలో లాంచ్ చేశాం.
20 ప్రధాన క్రీడలు..
ఈ యాప్‌లో క్రీడాకారులు తమకు కావాల్సిన కోచ్‌లను, స్టోర్ట్స్ అకాడమీ, జిమ్ ట్రైనర్ల గురించి తెలుసుకోవచ్చు. వారి ప్రొఫైల్ ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు. కోచ్‌లు సైతం వివిధ అకాడమీల్లో ఖాళీలను తెలుసుకోవచ్చు. పార్ట్‌టైం కోచింగ్ చేసుకోవచ్చు. గుడ్డిగా వెళ్లి నకిలీల చేతిలో మోసపోకుండా మా యాప్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని చాలామంది వెళుతున్నారు. ప్రస్తుతం ఈ యాప్‌లో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి సుమారు 20కి పైగా ప్రధాన క్రీడలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అర్హత కలిగిన వందమంది కోచ్‌లు, మూడు వందల మంది క్రీడాకారులు ఇన్స్టాల్ చేసుకోవడం విశేషం. రాబోయే రెండు నెలల్లోపు కోడ్ బుకింగ్‌లో అప్డేట్ తీసుకొస్తాం. కేటీఆర్ సర్ని కలిసి మా ఆలోచనలు వారితో పంచుకొని ఆయన సలహాలు తీసుకోవాలని ఉన్నది.
– రాజు పిల్లనగోయిన

Uma And Mayur With Athletes
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- APP
- Developed
- inspired
- KTR’s words
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

