నువ్వులు: ఒక కప్పు
పుదీన: అర కట్ట
చింతపండు: చిన్న నిమ్మకాయంత
పచ్చిమిర్చి: అయిదు
ఉల్లిగడ్డ, టమాటాలు: స్టఫింగ్‌కి సరిపడా
మిర్చీబజ్జీలు: స్టఫింగ్‌కి సరిపడా, ఒక బన్‌కి కనీసం ఒకటి
ఉప్పు: రుచికి తగినంత
ఇండియన్ ైస్టెల్లో సబ్వే బర్గర్‌ను తయారు చేసేందుకు ముందుగా నువ్వుల పచ్చడి చేసుకోవాలి. అందుకోసం నువ్వులను వేయించుకొని తరిగిన పుదీన, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి, ఉప్పును మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. స్టఫింగ్‌కి ఉల్లిగడ్డలు, టమాటాలను పల్చటి పొడవాటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సబ్వే బన్ను తీసుకుని నిలువుగా సగానికి కట్ చేయాలి. ఆ బన్ మీద నువ్వుల పచ్చడి రాసి మిర్చీబజ్జీలను ఉంచి టూత్‌పిక్‌తో గుచ్చాలి. ఇప్పుడు దీన్ని పెనం మీద కానీ మైక్రోవేవ్ ఓవెన్లోగానీ పెట్టి రోస్ట్ చేయాలి. తర్వాత టమాటాలూ, ఉల్లిగడ్డలూ కూడా జోడించి సర్వ్చేస్తే సరి. సబ్వే కొత్త ట్విస్ట్‌కి ఎవరైనా సాహో అనాల్సిందే!
– ఎం.బాలరాయుడు,
పాకశాస్త్ర నిపుణురాలు