నోయిడాలోని ‘సెక్టార్ 104’ అంటే పచ్చని చెట్లు, ప్రశాంతమైన ఇళ్లు.. ఇది ఆరేళ్ల క్రితం మాట. కానీ నేడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం ఇక్కడి ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్లన్నీ రంగురంగుల కేఫ్‌లు, నోరూరించే బేకరీలు, ఆధునిక రెస్టారెంట్లతో నిండిపోయాయి. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ‘ఫుడ్ హబ్’గా ఇది రూపాంతరం చెందింది. ఈ కథ ఒక నోయిడాకే పరిమితం కాదు. బెంగళూరులోని ఇందిరానగర్, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, పూణెలోని కోరేగావ్ పార్… ఇలా దేశంలోని ప్రముఖ నగరాల్లోని నివాస ప్రాంతాలన్నీ కాలక్రమేణా తినుబండారాల కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఇక కోల్‌కతాలోని పార్ స్ట్రీట్, ఢిల్లీలోని ఖాన్ మారెట్, కనౌట్ ప్లేస్ వంటి ప్రతిష్ఠాత్మక వాణిజ్య కేంద్రాలు పూటకూళ్ల వీధులుగా సిటీలైఫ్ని శాసిస్తున్నాయి.
నగరీకరణ ఇప్పుడు రూపు మార్చుకుంటున్నది. నాగరికతలో ‘ఆహార సంస్కృతి’ ఆధిపత్యం చెలాయిస్తున్నది. న్యూయార్‌లోని బ్రూక్లిన్ నుంచి సియోల్‌లోని హాంగ్డే వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ ధోరణి ఉన్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ఈ మార్పు శరవేగంగా విస్తరిస్తున్నది. ఇక్కడి నగరాల్లో ఫుడ్ బిజినెస్ మొత్తం నివాస ప్రాంతాల రూపురేఖలను మార్చేసే ఒక ప్రధాన వాణిజ్య శక్తిగా మారింది. మారెట్ అవసరాలు పట్టణ ప్రాంతాల స్వరూపాన్ని ఎలా మారుస్తాయనే దానికి ఢిల్లీలోని ‘కనౌట్ ప్లేస్’ ఒక నిలువెత్తు సాక్ష్యం. బ్రిటిష్ కాలంలో ఎలైట్ వర్గాల కోసం, వైవిధ్యభరితమైన సాంసృతిక, రిటైల్ వ్యాపారాల కోసం నిర్మించిన ఈ చారిత్రాత్మక మారెట్, 2014 నాటి పునరుద్ధరణ తర్వాత రూపురేఖలు మార్చుకుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ‘కనౌట్ ప్లేస్’లో కేవలం పది ప్రధాన రెస్టారెంట్లు మాత్రమే ఉండేవి. నేడు వాటి సంఖ్య వంద దాటింది. కానీ, ఈ మార్పు ‘కనౌట్ ప్లేస్’ అసలైన వైవిధ్యాన్ని దెబ్బతీసింది. రెస్టారెంట్లు అధిక రెంట్లు ఇస్తాయనే ఆశ కారణంగా.. ఒకప్పుడు ఇకడ అలరించిన పియానో షాపులు, పురాతన వస్తువుల విక్రయశాలలు, పుస్తకాల దుకాణాలు, రిటైల్ దుకాణాలు నేడు కనుమరుగయ్యాయి.
ఆకర్షించేది ఆహారమే గ్లోబల్ నగరాలు పుస్తకాల షాపులను, సాంసృతిక వేదికలను ఉద్దేశపూర్వకంగా కాపాడుకుంటాయి. కానీ, మనదేశంలో అటువంటి ప్రణాళిక మృగ్యమైపోయింది. మన పాత నగరాల మారెట్లు కేవలం ఆహారం చుట్టూ కాకుండా, హస్తకళలు, వాణిజ్యంతో పాటు ఖవ్వాలీలు, ముషాయిరాల వంటి సాంసృతిక కార్యక్రమాలతో సామాజిక వేదికలుగా విలసిల్లుతుండేవి. నేడూ వాణిజ్య రంగంలో రెస్టారెంట్లు అత్యంత ఆకర్షణీయమైన అద్దెదారులుగా మారాయి. కానీ, భారతీయ నగరాల్లో జనాన్ని ఆకర్షించేది ఆహారమే కానీ మ్యూజియంలు, గ్యాలరీలు కావని ఈ నయా పోకడ చెప్పకనే చెబుతున్నది. కనౌట్ ప్లేస్‌లో ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియం మూతపడటమే దీనికి ఉదాహరణ. ఒక ప్రాంతం ఫుడ్హబ్గా మారినప్పుడు అక్కడ జరిగే వ్యాపార లాభాల ఆధారంగా అద్దెలు పెరుగుతాయి. దీనివల్ల తకువ లాభాలు ఉండే వ్యాపారాలు తట్టుకోలేక మూతపడతాయి. రెస్టారెంట్లు భారీ ఇంటీరియర్ ఖర్చుల కారణంగా దీర్ఘకాలిక లీజులకు మొగ్గు చూపుతూ బ్రాండెడ్ సంస్థలు ప్రీమియం అద్దెలు ఇస్తాయి. ANAROCK గణాంకాల ప్రకారం.. మాల్స్, హై స్ట్రీట్స్‌లో ఫుడ్ అండ్ బెవరేజ్ లీజింగ్ వాటా 2019 లో 8 శాతం ఉండగా, 2025 నాటికి 12 శాతానికి పెరిగింది. 2030 నాటికి ఇది 16 శాతానికి చేరుకోవచ్చని అంచనా.
వాటికి ప్రాధాన్యం స్వాతంత్య్రానంతరం మన నగరాల్లో పబ్లిక్ స్వేర్లు, నడకమార్గాలు, ఓపెన్ ప్లాజాల వంటి సామాజిక ప్రదేశాల నిర్మాణం చాలా తకువ జరిగింది. ఇండ్లు, రోడ్లు కట్టారు కానీ, రూపాయి ఖర్చు లేకుండా ప్రజలు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకునే ఉచిత పబ్లిక్ స్పేస్‌ల గురించి అంతగా పట్టించుకోలేదు. ఈ ఖాళీని ఇప్పుడు కేఫ్‌లు, రెస్టారెంట్లు భర్తీ చేస్తున్నాయి. ఇవి ఇల్లు, ఆఫీసు కాకుండా ప్రజలు కలుసుకునే అనధికారిక ‘థర్డ్ ప్లేసెస్’గా మారుతున్నాయి. అయితే, ఇవి వాణిజ్య ప్రదేశాలు కావడం వల్ల, అకడ సమయం గడపాలంటే ఏదో ఒకటి కొనాలనే నిబంధన ఉంటుంది. వాణిజ్య స్థలాలు ఎప్పటికీ ప్రజా బాహుళ్య స్థలాలకు ప్రత్యామ్నాయం కాలేవు కదా! నగరాలకు పారులు, లైబ్రరీలు, సాంసృతిక వేదికలు ఎంతో అవసరం. ఆరోగ్యకరమైన పట్టణ సంస్కృతి అంటే కేవలం తినడం, తాగడం మాత్రమే కాదు. ప్రజలు చదువుకోవడానికి, చర్చించడానికి, కొత్త ఆలోచనలను పంచుకోవడానికి వేదికలుగా ఉండాలి. భవిష్యత్ పట్టణ ప్రణాళికలు రెస్టారెంట్లతో పాటు ఇటువంటి సాంసృతిక, సృజనాత్మక కేంద్రాల సహజీవనానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలని కోరుకుందాం!