చింతకాయలు తిన్నాడు.. తల దించుకున్నాడు
యాదగిరి తన నిక్కరు జేబులోని చింతకాయలను ఒక్కొక్కటిగా తీసి తినసాగాడు. దాన్ని చూసిన విద్వాంసుడికి నోట్లో నీళ్లు ఊరసాగాయి. కొద్దిసేపటికి నాదస్వరం ఊదడం ఆపి.. గబగబా వెళ్లి యాదగిరి చేతిలోని చింతకాయలు తీసుకుని తినసాగాడు.
అల్లరి
చింత తెలివి
ఒక ఊర్లో ఓ గొప్ప నాదస్వర విద్వాంసుడు ఉండేవాడు. అతని నాదస్వరానికి ఊరి జనం పరవశించి పోయేవారు. ప్రతిభతోపాటు అతనిలో మెల్లమెల్లగా అహంకారం కూడా పెరగసాగింది. దాంతో, ఊరివాళ్లందరినీ నిర్లక్ష్యం చేసేవాడు. ఓసారి గ్రామస్తులతో ఒక పందెం కాశాడు. తను నాదస్వరం ఊదేటప్పుడు ఎవ్వరూ ఆపలేరని, ఆపగలిగిన వారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. చాలామంది రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎవరి వల్లా సాధ్యం కాలేదు. అతనే తన వాద్యాన్ని ఆపగలుగుతున్నాడు కానీ, ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఆపడం లేదు. విషయం తెలుసుకున్న పొరుగూరు పిల్లవాడు యాదగిరి.. ఆ ఊరికి వచ్చాడు. విద్వాంసుడితో పోటీకి దిగుతానని ప్రకటించాడు. ‘పెద్దపెద్ద వాళ్ల వల్లనే కాలేదు.. పదేళ్ల పిల్లాడివి. నీవల్ల ఏమవుతుంది?’ అంటూ అందరూ నిరుత్సాహ పరిచారు. అయితే, తనకు ఒక్క అవకాశం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. సరేనని రాములవారి గుడి దగ్గర పోటీ ప్రారంభించారు గ్రామస్తులు. విద్వాంసుడు నాదస్వరం ఊదుతూ ఉంటే.. యాదగిరి అతని ఎదురుగా కూర్చున్నాడు. అర్ధ గంట గడిచింది. యాదగిరి తన నిక్కరు జేబులోని చింతకాయలను ఒక్కొక్కటిగా తీసి తినసాగాడు. దాన్ని చూసిన విద్వాంసుడికి నోట్లో నీళ్లు ఊరసాగాయి. కొద్దిసేపటికి నాదస్వరం ఊదడం ఆపి.. గబగబా వెళ్లి యాదగిరి చేతిలోని చింతకాయలు తీసుకుని తినసాగాడు. యాదగిరి గెలిచాడని ఊర్లోవాళ్లు చప్పట్లు చరిచారు. తప్పు తెలుసుకున్న విద్వాంసుడు తల దించుకున్నాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు
పెద్దల మాట
ఎవరో వేసిన సంకెళ్లని వారినే వచ్చి తీసేయమని చెప్పడం కాదు. మనమే సత్తా పెంచుకుని వాటిని ఛేదించడం మంచిది.
– డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్

Ambedakr
చెప్పుకోండి
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు. కొమ్మ కొమ్మకూ కోటి పువ్వులు. అన్ని పువ్వుల్లోనూ రెండే కాయలు?
– ఆకాశం, చుక్కలు, సూర్యుడు-చంద్రుడు
నల్లకుక్కకు నాలుగు చెవులు?
– లవంగం
చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గానీ పళ్లు లేవు. తంతే తన్నింది గానీ కాళ్లు లేవు?
– అద్దం
పద్యం – భావం
హీనుడెన్ని విద్యలిల నభ్యసించిన
ఘనుడుగాడు మొఱకు జనుడెగాని
పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, అనేక గ్రంథాలను చదివినా.. మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన.. గాడిద గొప్పది కాదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే! వారిలో ఎలాంటి మార్పు రాదు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

