హస్తినాపురం
తెలంగాణ ప్రబంధ పరిమళంలో అద్దంకి గంగాధర కవి రాసిన ‘తపతీసంవరణోపాఖ్యానము’లోని పద్యం ఇచ్చాం. ఈ పద్యంలో సంవరణ మహారాజు రాజధాని అయిన హస్తినాపుర వైభవాన్ని వర్ణించారు.
తెలంగాణ ప్రబంధ పరిమళం
సీ॥ ఉతిప్త శుండా ముఖోద్ధృతస్వర్ణ
దీపానీయ కల్పిత పారణములు
బహుళఘనీధూత బహుళపక్ష క్షపా
చటులాంధకార విస్మారణములు
జంగమవైఖరీ సంగత ధౌరేయ
ధరణీ ధరౌఘు సాధారణములు
బలిత కోపావేశ బల నిషూదన
ఘనకఠిన వజ్రోద్యమా కారణములు
తే.గీ॥ స్వైరసంచార మండలీ సాహసిక్య
ధారణప్రౌఢిమా క్షమా ధోరణములు
విమత నరనాథ సైనిక వీరదర్ప
హారణంబులు తత్పురీ వారణములు.
ఈ పద్యం అద్దంకి గంగాధర కవి రాసిన ప్రసిద్ధ ప్రబంధం ‘తపతీసంవరణోపాఖ్యానము’ లోనిది. గోల్కొండ నవాబైన ఇబ్రహీం కుతుబ్ షా (ఇభరాముడు)కు అంకితమిచ్చిన ఈ కావ్యంలో, హస్తినాపుర (సంవరణ మహారాజు రాజధాని) వర్ణనలో భాగంగా అక్కడి ఏనుగులను వర్ణిస్తూ కవి చెప్పిన అద్భుతమైన సీస పద్యమిది. ఒక రకంగా మల్కిభరాముడి సైన్యంలోని ఏనుగులు ఈ విధంగా ఉన్నాయని చెప్పడం కవి ఉద్దేశం కావచ్చు. హిందూరాయ విభాళుడుగా పలుసార్లు కవి మల్కిభరాముని కీర్తించడం జరిగింది. కానీ విభాళుడు అంటే సకారాత్మక అర్థం నిఘంటువులో కనిపించలేదు.
ఇక పద్యానికి వస్తే.. ఆ హస్తినాపురంలోని ఏనుగులు (వారణములు) ఎలా ఉన్నాయంటే… ఉతిప్త శుండా ముఖోద్ధృతస్వర్ణదీపానీయ కల్పిత పారాణములు: అవి తమ తొండాలను పైకెత్తి ఆకాశగంగ (స్వర్ణనది) లోని నీటిని పైకి చిమ్ముతుంటే, ఆ ఆకాశంలో ప్రయాణించే సూర్యుడికి పూజా జలాన్ని సమర్పిస్తున్న మేఘాల లాగా ఉన్నాయి. పారణము అంటే మేఘం అనే అర్థం కూడా ఉంది.
బహుళఘనీధూత బహుళపక్ష క్షపాచటులాంధకార విస్మారణములు: దట్టంగా కమ్ముకున్న కృష్ణపక్ష (బహుళ పక్ష) రాత్రుల వంటి నల్లని కాంతి గల ఆ ఏనుగులు గుంపులుగా నిలబడటం వల్ల ఏర్పడిన నిబిడాంధకారం, అసలైన రాత్రి చీకటిని సైతం మర్చిపోయేలా (అంతకంటే దట్టంగా) చేస్తున్నది.
జంగమవైఖరీ సంగత ధౌరేయ ధరణీ ధరౌఘు సాధారణములు: నడుస్తున్నట్లుండే ఆ ఏనుగుల నడకల వైఖరి చూస్తుంటే, పూర్వం రెక్కలు ఉండి సంచరించిన శ్రేష్ఠమైన కులపర్వతాలు మళ్లీ నడుస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి. అవి అంతటి భూభారాన్ని మోయగల సామర్థ్యానికి ఆధారాలుగా ఉన్నాయి.
బలిత కోపావేశ బలనిషూదన ఘనకఠిన వజ్రోద్యమా కారణములు: తీవ్రమైన కోపంతో దేవేంద్రుడు (బలనిషూదనుడు) ప్రయోగించే అత్యంత కఠినమైన వజ్రాయుధపు దెబ్బలను సైతం ఎదుర్కొని తట్టుకోగల వజ్రసమానమైన దృఢ శరీరం గలవి.
స్వైరసంచార మండలీ సాహసిక్య ధారణప్రౌఢిమా క్షమా ధోరణములు: తమ ఇష్టానుసారంగా మందలుగా తిరుగుతూ, ఎలాంటి సాహసానికైనా వెనుకాడకుండా నిలిచే ప్రౌఢిమను, భూమి వంటి గొప్ప ఓర్పును (క్షమను) కలిగి ఉన్నాయి.
విమత నరనాథ సైనిక వీరదర్ప హారణంబులు తత్పురీ వారణములు: శత్రు రాజుల సైన్యాల్లోని వీరుల గర్వాన్ని హరించే (అణచివేసే) పరాక్రమం కలిగిన ఆ ఏనుగులు ఆ నగరంలో శోభిల్లుతున్నాయి.
– చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

