ఒకపారి ఓ పొరుగు దేశపాయినె కృష్ణచంద్ర దర్బారుకు అచ్చిండు. అండ్లున్న అందరితోని.. ఆల్లాల్ల బాసల్ల మాట్లాడవట్టిండు. మాలెస్క పదకొండు పన్నెండు బాసలల్ల ఆర్‌పార్ మాట్లాడిండు. అటెన్క.. “రాజా సాబ్! నా అసలు బాస ఏదో జెప్పేటోళ్లు మీ కొలువుల ఎవరన్న ఉన్నరా? జెప్పుండ్రి. చెప్పితె.. నేను నా ఇనాములన్ని ఈడనే ఇడిశివెట్టి పోత!” అంట సవాల్ జేశిండు. గిది అందరితోని గాదని.. గోపాల్ ఖంద్కు అప్పజెప్పిండు రాజు. ఒకపారి గా పొరుగూరాయినె పొద్దుగాల పొద్దుగాలనే ఎటో వోతండు. మన గోపాల్ వేరే ఏశం గట్టుకొని.. ఆయినె ఎన్కనే వోయి, ఈపుల ఒక్క గుద్దు గుద్దిండు.
దాంతోని ఆయినె బోర్లబొక్కల కిందవడ్డడు. “నన్ను కొట్టింది ఎవ్వలు?” అంట.. బెంగాలీల ఇయ్యరమయ్యర తిట్టవట్టిండు. అది అర్థంగానట్టు గోపాల్ హిందీల తిట్టిండు. ఈన గూడ అదే బాసల ఒర్రెవరకు.. గోపాల్ బూతులు తిట్టుడు షురూ జేసిండు. బూతులు ఇనవడుడుతోనే.. ఆయినె ఒడియాల తిట్టుడు మొదలువెట్టిండు. అంతట్లకే.. అక్కడ మాలెస్క మంది జమైండ్లు. ఆయింత ఖుల్లంఖుల్ల అయితదని మెల్లగ ఆడికెల్లి ఎల్లిపేయిండు గోపాల్. తెల్లారంగనే గోపాల్ కొలువులకు వోయి రాజును గలిశిండు. పొరుగుదేశపు ఆయినెను విలిపిచ్చిండు. “రాజా! ఈయినె తల్లి బాస ఒడియా!” అంట జెప్పిండు గోపాల్. దాంతోని రాజు గోపాల్‌కు ఇనామిచ్చిండు.
– వెలగపండ్లు
– మొగలిపువ్వు
మీకు సరైన గుర్తింపు లభించలేదని చింతించకండి. ఎప్పటికైనా ఆ గుర్తింపు పొందడానికి మరింతగా శ్రమించండి.
– అబ్రహాం లింకన్
ఒకప్పుడు దక్షిణభారత చిత్రసీమకు కేంద్రమైన చెన్నై నగరంలో కాకులు ఎక్కువగా ఉండేవట. 1950ల్లో ఔట్‌డోర్ షూటింగ్ చేసేటప్పుడు వాటి గోల భరించలేకుండా ఉండేదట. అందుకే, డమ్మీ తుపాకులతో శబ్దం చేస్తూ కాకులను తరిమేసేవారట. అంతేకాదు.. ఆ సినిమా టైటిల్స్‌లోనూ టెక్నీషియన్ల పేర్లతోపాటు ‘క్రో షూటర్’ అంటూ కాకులను తరిమేసేవారి పేర్లను కూడా వేసేవారట.
అసువినాశమైన నానంద సుఖకేళి సత్యనిష్ఠపరుని సంతరించు సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ! వినుర వేమ! తాత్పర్యం: సత్యవంతుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడు కానీ, అబద్ధం ఆడటానికి మాత్రం అంగీకరించడు. అలాంటివాడే.. సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం.