e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News కోట్లు సంపాదించి.. తన కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చాడు

కోట్లు సంపాదించి.. తన కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చాడు

Girish mathrubootham | గిరీశ్‌ మాతృభూతం.. ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. తన కంపెనీ మార్కెట్‌ విలువను 13 బిలియన్‌ డాలర్లకు చేర్చడంతో పాటు.. అందులో పనిచేస్తున్న 500 మందికిపైగా ఉద్యోగులను ఒక్కసారిగా కోటీశ్వరులను చేశాడు. యువ టెక్కీలు గిరీశ్‌ పేరును మంత్రంలా జపిస్తున్నారు. ఎక్కడా కుంగిపోకుండా, లక్ష్యం విషయంలో రాజీ పడకుండా.. ప్రతి ఓటమినీ గెలుపునకు నిచ్చెనగా మార్చుకున్నాడు కాబట్టే, తానే ఓ కుబేరుల ఫ్యాక్టరీగా మారాడు గిరీశ్‌.

girish mathrubootham (    గిరీశ్‌ మాతృభూతం )
girish mathrubootham ( గిరీశ్‌ మాతృభూతం )

‘గెలుపుదేముంది? ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అదే ఓటమి,ప్రపంచమంటే ఏమిటో పరిచయం చేస్తుంది. నలుగురిలో ఎలా బతకాలో, నలుగురిని ఎలా కలుపుకొని పోవాలో, సమష్టిగా ఎలా విజయం సాధించాలో నేర్పిస్తుంది. నా ప్రతి విజయం వెనుక ఓ ఓటమి ఉంది. దాని నుంచి నేను నేర్చుకున్న విలువైన పాఠం ఉంది’ అంటున్నాడు తమిళనాడుకు చెందిన గిరీశ్‌ మాతృభూతం. 30 ఏండ్లలోపు ఏ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయినా ఎంత సంపాదిస్తాడు? మహా అయితే ముప్పై వేల నుంచి యాభై వేల జీతంతో కాలం వెళ్లదీస్తుంటాడు. అదే.. గిరీశ్‌ స్థాపించిన ‘ఫ్రెష్‌వర్క్స్‌’ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో 30 యేండ్లలోపువారిలో 70మందికిపైగా కోటీశ్వరులయ్యారు. దాదాపు 500మందికి తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చి, షేర్ల రూపంలో వాటా కూడా ఇచ్చాడు గిరీశ్‌. తాను గెలుస్తూ, తన కంపెనీని నమ్ముకున్న వాటాదారులను, వినియోగదారులను, ఉద్యోగులనూ గెలిపించాడు.

తల్లిప్రేమకు నోచుకోని బాల్యం

- Advertisement -

తమిళనాడులోని తిరుచిరాపల్లి గిరీశ్‌ సొంతూరు. తను పుట్టిన కొన్నాళ్లకే తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తల్లి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. ఫలితంగా తల్లిప్రేమకు దూరమయ్యాడు. ఆ ప్రభావమే కావచ్చు, చిన్ననాటి నుంచే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటైంది. తండ్రి రత్నగిరీశ్‌ మరో పెండ్లి చేసుకున్నాడు. ఎందుకో, ఆమెను తల్లిగా స్వీకరించలేకపోయాడు గిరీశ్‌. ఇంట్లో రోజూ ఏదో ఒక గొడవ జరుగుతుండేది. ప్రతిసారీ తనే ఓడిపోయేవాడు. రెండుసార్లు ఇంట్లోనుంచి పారిపోయాడు కూడా. క్రమంగా తల్లి ప్రేమను మేనత్తల్లో వెతుక్కున్నాడు. జీవితంలో ఎదగాలన్న సంకల్పం బలపడింది. చదువుపై దృష్టిపెట్టాడు. హాస్టల్‌లో ఉంటూనే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశాడు, తర్వాత ఎంబీఏ చదివాడు. చదువులో భాగంగా తాను అధ్యయనం చేసిన ఆంత్ర ప్రెన్యూర్‌షిప్‌ కథలు వ్యాపారం వైపు నడిపించాయి. స్నేహితుల సాయంతో ‘మైండ్‌స్పియర్‌’ అనే విద్యాసంస్థను ప్రారంభించాడు మాతృభూతం. కానీ, ఆ ప్రాజెక్ట్‌ ఘోర పరాజయాన్ని రుచి చూపింది.

అమెరికా ప్రయాణంతో..

ఆ కష్ట సమయంలో గిరీశ్‌ను హెచ్‌సీఎల్‌ సిస్కోలో కొలువు వరించింది. ఆ తర్వాత యూఎస్‌లోని టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ, ఏడాది పనిచేసిన తర్వాత, ‘జోహో’ నుంచి పిలుపు వచ్చింది. 2010లో తన సహోద్యోగి షాన్‌ కృష్ణస్వామితో కలిసి ‘ఫ్రెష్‌డెస్క్‌’ను ఏర్పాటు చేశాడు. ‘యూజర్‌ ఫోకస్డ్‌ క్లౌడ్‌’ ఆధారిత కస్టమర్‌ సర్వీస్‌ సాఫ్ట్‌వేర్‌ సేవలు ప్రారంభించాడు. ఆస్ట్రేలియా, అమెరికాల నుంచీ ఆర్డర్లు వచ్చాయి. 2017లో ఫ్రెష్‌డెస్క్‌ను.. ఫ్రెష్‌వర్క్‌గా మార్చాడు. అలా, 2018 నాటికి వార్షికాదాయం వంద మిలియన్‌ డాలర్లను దాటింది.

రజనీ వీరాభిమాని

‘ఫ్రెష్‌ వర్క్స్‌’ సంస్థ వెబ్‌, ఫోన్‌, ఈమెయిల్‌, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నది. ఇండియాలో లెన్స్‌కార్ట్‌, పేటీఎంలకు సాఫ్ట్‌వేర్‌ సేవలను అందిస్తున్నది. గిరీశ్‌ చాలా సరదా మనిషి. తన మొదటి సాలరీతో స్నేహితులకు మర్చిపోలేని పార్టీ ఇచ్చాడు. గిరీశ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వీరాభిమాని. ఆయన సినిమా విడుదలైతే, ఉద్యోగుల కోసం ఏకంగా థియేటర్లనే బుక్‌ చేస్తాడు. ప్రస్తుతం తన కంపెనీలో 4300 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 76 శాతం మందికి సంస్థ షేర్లు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

అబ్ర‌హం లింక‌న్ గ‌డ్డం పెంచ‌డం వెనుక ఉన్న క‌థేంటో తెలుసా !

Bullettu bandi | భార‌త్‌లో బుల్లెట్ బండిని మొదటిసారి వాడింది ఎవరు? ఆ మ‌ధ్య‌కాలంలో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ ఎందుకు క‌నుమ‌రుగైంది?

myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు.. ఆమె పుట్టుక‌ ఇప్ప‌టికీ మిస్ట‌రీనే

Honeymoon | రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హ‌నీమూన్‌.. ఎక్కడో తెలుసా?

ప్రేమ కోసం రాజ‌రికాన్ని, రాజ‌భోగాల‌ను వ‌దిలేసిన యువ‌రాజులు, యువ‌రాణులు వీళ్లే..

Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవ‌లం 11 మందే.. మ‌రి రాజుగారి పనేంటో తెలుసా !

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement