Genelia | అస్సలు ఊహించలేదు.. రీఎంట్రీపై జెనీలియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Genelia Deshmukh | ‘అంతేనా? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ’ డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ‘హహ్హహా.. హహ్హహ్హా హాసినీ’ పాటతో చిలిపి తారగా చెరగని ముద్రవేసింది. పెండ్లితో జెనీలియా దేశ్‌ముఖ్‌గా మారిపోయింది.
Genelia Deshmukh | ‘అంతేనా? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ’ డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ‘హహ్హహా.. హహ్హహ్హా హాసినీ’ పాటతో చిలిపి తారగా చెరగని ముద్రవేసింది. పెండ్లితో జెనీలియా దేశ్‌ముఖ్‌గా మారిపోయింది. రియల్ లైఫ్‌లో అన్ని బాధ్యతలకూ న్యాయం చేస్తూనే.. కన్నడ-తెలుగు ద్విభాషా చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నది జెనీలియా. ఈ సందర్భంగా తన మనసులోని మాటలు..
నా కెరీర్లో మంచి మంచి పాత్రలు పోషించిందీ.. విజయాన్ని రుచి చూసిందీ దక్షిణాదిలోనే. నటిగా నాకంటూ ఓ గుర్తింపు పొంది పరిణతి సాధించింది కూడా ఇక్కడే. ‘తుఝే మేరీ కసమ్’ చేస్తున్న సమయంలోనే సత్య, బాయ్స్ సినిమాల్లో నటించాను. ముంబై నుంచి వచ్చినా ఇట్టే తెలుగమ్మాయిలా మారిపోయాను. దక్షిణాది విలువలు, సంస్కృతి నాకు నచ్చాయి. నేను శాకాహారిని. బెంగళూరు వచ్చిన తర్వాత మరీ పట్టింపు ఎక్కువైంది. ఇక్కడి ఆహార పద్ధతులు నాకు నచ్చాయి. ముంబైలో ఇలా ఉండకపోయేది. మా పిల్లలూ శాకాహారులే కావడం కలిసొచ్చింది.

కన్నడ సూపర్ స్టార్ సుదీప్, ఆయన భార్య ప్రియ నా క్లోజ్ ఫ్రెండ్స్. ఏదైనా వాళ్లతోనే డిస్కస్ చేస్తుంటా. ఆ ఇద్దరితో మాట్లాడుతున్నంతసేపూ, నా సొంతింట్లో ఉన్న అనుభూతే కలుగుతుంది. ఒకవేళ షూట్ లేకపోతే ఇంట్లోనే ఉండిపోతాను. పిల్లలతో ఆడుకుంటాను. క్లోజ్ ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడానికి ఇష్టపడతాను. సోషల్ మీడియా వేదికగా మేం అందించే ప్రతీ కంటెంట్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో సమయం వృథా చేసుకోవడం ఎందుకని సోషల్ మీడియాకు దూరంగా ఉండేవాళ్లం. కానీ లాక్డౌన్ మా ఆలోచన మార్చేసింది.
నిజానికి నేను పిల్లలతో చాలా బిజీగా ఉన్నాను. రీ ఎంట్రీ ఉంటుందని ఊహించలేదు. ఆలోచన మాత్రం ఉండేది. రీఎంట్రీకి సంబంధించి ఫస్ట్ కాల్ రితేశ్‌కు వచ్చింది. నటిగా దీన్నొక మంచి అవకాశంగా భావించాను. పిల్లలు క్రమంగా అలవాటు పడతారు కదా. నాకు నచ్చిన పనే నన్ను వెతుక్కుంటూ వస్తే ఎందుకు కాదనాలి? అనిపించింది. నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి పాత్రలు కోరుకుంటారు? వాటికి నేను ఏ విధంగా న్యాయం చేయగలను? తదితర విషయాలన్నీ ముందుగానే మాట్లాడతాను. నాకు ఇదొక చాలెంజ్ లాంటిది. అప్పటికీ, ఇప్పటికీ సినిమా పరిశ్రమ చాలా మారింది. ప్రేక్షకుల అభిరుచిలో కూడా మార్పు వచ్చింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకునే డైరెక్టర్లు నా క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ.. ఏ పరిశ్రమకు ఆ పరిశ్రమ భిన్నమైంది. ఏ ఇండస్ట్రీ ప్రత్యేకత ఆ ఇండస్ట్రీది. అన్ని పాత్రలనూ మనసుపెట్టి చేస్తాను. కానీ, ఒక్కొక్కటి ఒక్కో తీరుగా జనాల్లోకి వెళ్తుంది. ఉదాహరణకు.. హాసిని పాత్ర. ఒకవేళ నేను బొమ్మరిల్లులో చేయకపోయి ఉంటే ఈ గుర్తింపు వచ్చేది కాదు. అందుకే నాకు హాసిని అంటే ఇష్టం. పదేండ్లు దాటినా నన్ను హాసినిగానే చూస్తున్నారు, ‘హాసినీ’ అనే పిలుస్తునారు. ఎంత అదృష్టం!
నా నట జీవితంలో పదేండ్ల క్రితం వరకూ ఒక ఫేజ్. పెద్ద ప్రాజెక్టుల్లో నటించాను. దాదాపు అన్నీ హిట్సే. అన్నిట్లోనూ మంచి పాత్రలు చేశాను. ప్రస్తుతం మాత్రం, పెద్ద స్క్రీన్లోనే ఉండాలి అనే రోజులు పోయాయి. ఓటీటీ అనేది అప్డేట్ వెర్షన్. డిజిటల్ మీడియా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ మాధ్యమమే. గత డిసెంబర్లో ఫస్ట్ షూట్ మొదలుపెట్టాను. ఇప్పటికి నాలుగు సినిమాలు పూర్తయ్యాయి. ఇలాంటి ప్రాజెక్ట్‌లతో రీ ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఓ అద్భుతం.
Read More :
Pridhvi Raj | పృథ్విరాజ్‌కు షాకిచ్చిన ఫ్యామిలీ కోర్టు.. భరణంగా నెలకు రూ.8 లక్షలు ఇవ్వాలంటూ తీర్పు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

