జాయప సేనాని కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి బావమరిది. ఆయన ఆస్థానంలో గజ సాహిణిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ద్వీపదేశపు రాజు అయ్యవంశానికి చెందిన పిన్నచోడుని కొడుకు. జాయప పేరు చెప్పగానే చరిత్ర పరిజ్ఞానం ఉన్నవాళ్లకు గుర్తుకువచ్చే పుస్తకం ‘నృత్త రత్నావళి’. ఇదే కాకుండా ‘వాద్య రత్నావళి’, ‘గీత రత్నావళి’ కూడా రచించినట్టు తెలుస్తున్నది. చేబ్రోలులో ఓ శాసనం కూడా జాయప సేనాని వేయించాడు. ఇలాంటి శాసన, కాకతీయుల చరిత్రను వివరించే ఆధారాలతో మత్తి భానుమూర్తి ‘జాయ సేనాపతి’ చారిత్రక కాల్పనిక నవల రచనకు ఉపక్రమించారు.
ఈ నవల నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’లో సీరియల్‌గా వస్తున్నది. గణపతిదేవుడి సేనలు ద్వీపదేశాన్ని ఆక్రమించిన తర్వాత తన అక్కలు నారాంబ, పేరాంబతో కలిసి జాయప ఓరుగల్లు చేరుకుంటాడు. అయితే, అంతఃపురానికి వెళ్లకుండా ఓ సైనికుడి ఇంట్లో సామాన్యుడిలా పెరిగి పెద్దవాడవుతాడు. నృత్యంలో శిక్షణ పొందుతాడు. యుద్ధవిద్యల్లో ఆరితేరతాడు. వెలనాటి పృథ్వీశ్వరుడితో జరిగిన యుద్ధంలో పాల్గొని గణపతిదేవుడి మెప్పు పొందుతాడు. పిన్నచోడుని కొడుకే జాయప అని గణపతిదేవుడు అసలు విషయం తెలుసుకుంటాడు.
నారాంబ, పేరాంబను వివాహం చేసుకుని గణపతిదేవుడు అయ్యవంశం వారితో వియ్యమందుతాడు. అలా జాయప సేనాని గణపతిదేవుడికి ఆత్మీయ బంధువుగా మారిపోతాడు. ఇక్కడితో రచయిత ‘జాయ సేనాపతి’లో తొలి భాగం ముగించారు. ఇది చదువుతుంటే కాకతీయుల కాలపు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విశేషాలు కండ్ల ముందు మెదులుతాయి. అయితే, చక్రవర్తుల జీవితం కాకుండా ఓ ప్రతిభావంతుడైన సామంతుడి జీవితాన్ని రచన అంశంగా ఎంచుకోవడం భానుమూర్తి ప్రత్యేకత. అలా మరుగునపడి ఉన్న అంశానికి తనదైన శైలిలో వర్ణనలు చేస్తూ పుస్తకం ఆసాంతం అద్భుతంగా రూపుదిద్దారు.
రచన: మత్తి భానుమూర్తి
పేజీలు: 240; ధర: రూ. 280
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల దుకాణాలు
రచన: జిల్లేళ్ళ బాలాజీ
పేజీలు: 132;
ధర: రూ. 150
ప్రచురణ: పార్వతీ విశ్వం ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 98666 28639
రచన: అపర్ణ తోట
పేజీలు: 87;
ధర: రూ. 100
ప్రచురణ: బోధి
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 92474 71362
రచన: నానా
పేజీలు: 75;
ధర: రూ. 90
ప్రతులకు: 98491 39337