మీ లక్కీ నంబర్ ఏంటో తెలుసా? మీ అదృష్ట సంఖ్య ఇదే అయితే అదృష్టం కలిసొస్తుంది!!
Find your Lucky number | కొత్త సంవత్సరంలో సరికొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా! అయితే, మీ లక్కీ నంబర్ ఆధారంగా ఈ ఏడాది ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చదువుకోండి. అంకెలు చెప్పిన సంగతుల ఆధారంగా ఈ ఏడాది ఎలా వ్యవహరించాలో ఒక అంచనాకు రండి. మరి లక్కీ నెంబర్ తెలుసుకోవడం ఎలా అంటారా? మీ పుట్టిన తేదీ అంతా కూడితే వచ్చేదే మీ అదృష్ట సంఖ్య. (ఉదా॥ పుట్టిన తేది 12/06/2002 అయితే 1+2+6+2+2=13= 1+3=4, నాలుగు అదృష్ట సంఖ్య). ఇంకెందుకు ఆలస్యం? మీ అదృష్ట సంఖ్య ఆధారంగా ఫలితాలు చూసుకోండి.

ముందుచూపు ఉంటే చాలు. ఈ ఏడాది పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి రాదు. సలహాలు ఇచ్చే వాళ్లు సవాలక్ష మంది ఉంటారు. అవన్నీ ఓపికగా విన్నా, మీ మనసు చెప్పిన మాటకే ఓటేయండి. ఆత్మవిశ్వాసానికి మించిన బలం లేదు. మీ వ్యక్తిగత బలాలు అవసరం వచ్చినప్పుడు తప్ప, అందరి ముందూ ప్రదర్శించాల్సిన పనిలేదు. నచ్చిన వ్యక్తి తారసపడితే మనసులో మాట నాన్చకుండా చెప్పేయండి. మార్చి వరకూప్రేమికులకు అనుకూలం. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు సానుకూలం. జూన్-అక్టోబర్ మధ్య కార్యసిద్ధి ఉంది.

మడి కట్టుకుని కూర్చుంటే సరిపోదు. స్నేహితులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒంటరిగా కాకుండా, నలుగురిని కలుపుకొని ముందుకు వెళ్లడం మంచిది. కొత్త అవకాశాలు పలకరిస్తాయి. మీ ఆలోచనలు, చేసే పని ఉన్నత స్థాయిలో ఉండేలా చూసుకోండి. అవసరమైన సమయాల్లో ఊహించని వ్యక్తుల మద్దతు లభిస్తుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు వృత్తి, వ్యాపారాల్లో సంయమనం పాటించడం అవసరం. జూలై నుంచి అక్టోబర్ వరకు బాగుంటుంది. జూన్- సెప్టెంబర్ మధ్య ప్రేమలో విజయం సాధిస్తారు.

ఈ సంవత్సరం మీకు సంతోషంగా గడిచిపోతుంది. కొత్త లక్ష్యాలను సాధిస్తారు. బాధ్యతలు తగ్గుతాయి. మీరు కోరుకున్నట్లుగా జీవనం సాగిస్తారు. ఆశయ సాధనలో మాత్రం నిబద్ధతతో వ్యవహరిస్తారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. మార్చి-ఏప్రిల్ మధ్య మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యకాలం సంతోషంగా గడుపుతారు.వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. ఫిబ్రవరి, జూలై, నవంబర్ మాసాల్లో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. పూర్తిస్థాయిలో శక్తి సామర్థ్యాలు వినియోగించాలి. శ్రమకు తగిన గుర్తింపును పొందుతారు. కానీ, వ్యక్తులు, వ్యవస్థలు, పరిస్థితుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయోజనం ఆశించకుండా కష్టపడితే విజయం మీదే! మార్చి-జూలై మధ్య ఉద్యోగంలో ఉన్నతి. అక్టోబర్-డిసెంబర్ మధ్య మిశ్రమ ఫలితాలు. ప్రేమ వ్యవహారాల్లో ఫిబ్రవరి మినహాయిస్తే ఏడాదంతా బాగుంటుంది.

ఈ ఏడాది విలక్షణంగా గడుస్తుంది. విహారాలు చేస్తారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మనసుకు నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకుంటారు. గతాన్ని తవ్వుకుంటే ప్రయోజనం ఉండదు. పరిధులు విధించుకోకుండా ముందడుగు వేయండి. ఏప్రిల్-జూలై మధ్య ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. మార్చి వరకూఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నలుగురితో సంతోషంగా కాలం గడుపుతారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వాస్తవిక ప్రపంచంలో ఉంటారు. ప్రతి విషయాన్నీ పూర్తిస్థాయిలో అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులను కలుసుకుంటారు. వారి ప్రేమను అంగీకరిస్తారు. మార్చి-ఏప్రిల్ మధ్య ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. జూన్-జూలై నెలల్లో విజయాలు సాధిస్తారు. ఏప్రిల్ ద్వితీయార్ధం, అక్టోబర్‌లో ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు.

2022 మీకు ఫలప్రదమైన సంవత్సరం. అనుకున్న లక్ష్యాలను అందుకుంటారు. చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తున్న పనులను పూర్తిచేస్తారు. పరిస్థితులను అర్థం చేసుకోవడంలో పరిపక్వత సాధిస్తారు. భారీ పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఏప్రిల్‌లో వ్యాపారం పుంజుకుంటుంది. డిసెంబర్‌లోనూ మంచి లాభాలు అందుకుంటారు. అవివాహితులకు ఏప్రిల్, జూలై, సెప్టెంబర్ నెలల్లో కల్యాణ యోగం. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మీ బలాలను పూర్తిస్థాయిలో వినియోగించాల్సిన సంవత్సరం ఇది. చాకచక్యంగా వ్యవహరించండి. అదృష్టం కలిసి వస్తుంది. పరిస్థితుల్లో ఊహించని విధంగా మార్పు వస్తుంది. ఫిబ్రవరి, మార్చి, అక్టోబర్ నెలలు ఉద్యోగంలో అనుకూలం. ఏడాది ద్వితీయార్ధంలో కల్యాణ యోగం. జూలై- ఆగస్ట్ మాసాల్లో ఆరోగ్య భంగం.

ఈ ఏడాది మీలోని కొత్త శక్తులు వెలుగు చూస్తాయి. సవాళ్లను ఎదుర్కొని మీ సత్తా చాటుతారు. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించకండి. ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయండి. స్నేహితులతో అనుబంధం పెరుగుతుంది. కాబోయే జీవిత భాగస్వామి పరిచయం అవుతారు. తొలి త్రైమాసికంలో ఉద్యోగంలో అభివృద్ధి పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. జూలై, నవంబర్ నెలలు ప్రేమికులకు అనుకూలం. మార్చిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Guinness Book | ఒంటిపై 85 స్పూన్లు బ్యాలెన్స్ చేసిన వ్యక్తి.. గిన్నీస్ బుక్‌లో చోటు..
Paracetamol | పారాసిటమాల్‌తో పాములను చంపుతున్న అమెరికా.. ఎందుకలా చేస్తోంది?
Rum in Winter | చలికాలంలో రమ్‌కు ఎందుకంత క్రేజ్? రమ్‌ను ఎలా తయారు చేస్తారు?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- future
- lucky number
- number
- numeric
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

