మన శరీరంపై ఏ వస్తువునైనా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కానీ కొందరు ఇలా చేసి చూపిస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పుడు ఇరాన్‌కు చెందిన ఒక వ్యక్తి అదే పని చేసి చూపించాడు. అబోల్ఫాజీ సాబెర్ ముఖ్తారీ అనే వ్యక్తి తన శరీరంపై టేబుల్ స్పూన్లు బ్యాలెన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 85 స్పూన్లను తన శరీరంపై ఉంచాడు. దీంతో అతను గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ‘శరీరంపై అత్యధిక స్పూన్లు బ్యాలెన్స్ చేసిన వ్యక్తి’ అతనికి ఈ రికార్డు లభించింది. కరాజ్ ప్రాంతంలో ఈ ఫీట్ చేసి చూపించిన ముఖ్తారీకి గిన్నిస్ నిర్వాహకుల నుంచి ధ్రువీకరణ పత్రం కూడా లభించింది.
అసలు ఇలా చేస్తున్నారు? అని ముఖ్తారీని ప్రశ్నించగా.. ‘తన శరీరంలోని శక్తిని వస్తువుల్లోకి పంపడమే తన శక్తి వెనుక ఉన్న సీక్రెట్’ అని చెప్పాడు. ఏదేమైనా అతను సాధించిన రికార్డు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.