ఏ సమయంలోనైనా.. ఏ ప్రాంతంలోనైనా.. జీవితం ఆగకూడదు. ముందుకే సాగాలి. ఉరుకుల పరుగుల సందర్భాల్లో ఇదిగో ఈ స్మార్ట్ టార్చ్‌ని వాడేయండి. ఇది కేవలం టార్చ్ మాత్రమే కాదు.. పర్సనల్ సేఫ్టీ డివైజ్గానూ పని చేస్తుంది. ఇందులో 100 డెసిబల్స్‌తో అలర్ట్ చేసే అలారం ఉంది. పిల్లలు, పెద్దలు అత్యవసర సందర్భాల్లో అలారం మోగించి.. సాయం పొందొచ్చు. టార్చ్ పైన బటన్ నొక్కితే లైట్ వెలుగుతుంది. డబుల్ క్లిక్ చేస్తే ఫ్లాష్ లైట్లా పని చేస్తుంది. అలాగే నొక్కి ఉంచితే సైడ్ లైట్ ఆన్ అవుతుంది. 2.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. యూఎస్బీ టైప్-సీ కేబుల్‌తో ఛార్జ్ చేయచ్చు.
ధర: రూ.225
దొరుకు చోటు: https://acesse.dev/Pb6hE
కారు, బైక్ లేదా సైకిల్ లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఆలోచించేది టైర్లలో గాలి సరిపడా ఉందా? లేదా? అనే. అనుకోకుండా టైర్లలో గాలి కాస్త తగ్గితే.. లేదా పంక్చర్ అయితే..? ఏం కంగారు పడకుండా ఇదిగో ఈ వైర్లెస్ డివైజ్‌తో గాలి నింపేయొచ్చు. పవర్ బ్యాంకు పరిమాణంలో కనిపించే దీని పేరు ‘వాయు 3.0’. పొట్రానిక్స్ కంపెనీ దీన్ని రూపొందించింది. కారు, బైక్, సైకిల్.. టైర్ ఏదైనా గాలి ఎంతుందో చెక్ చేయొచ్చు. డిస్ప్లేలో రీడింగ్ కనిపిస్తుంది. తక్కువైతే క్షణాల్లో గాలిని నింపేస్తుంది. ఎంతలా అంటే.. కారు టైర్లో 1.5 నిమిషాల్లో గాలిని నింపేయొచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 4 నుంచి 5 సార్లు టైర్లలో గాలిని నింపుతుంది. ఈ వాయు 3.0 పరికరంలో ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. రాత్రి రాత్రి కారు పంక్చర్ అయితే ఈ లైట్ ఆన్ చేసుకుని టైర్ మార్చుకోవచ్చు.
ధర: రూ.2,099
దొరుకు చోటు: https://l1nq.com/byCmO
వినూత్నమైన డిజైన్‌తో గ్యాడ్జెట్ ప్రియుల మదిని దోచుకున్న నథింగ్ స్మార్ట్ ఫోన్.. సమ్‌థింగ్ స్పెషల్‌గా మరో మోడల్‌తో ముందుకొచ్చింది. అదే (2a) Plus Community Edition. దీంట్లోని స్పెషల్ ఏంటంటే.. ఇది చీకట్లో మెరుస్తుంది. అందుకు తగిన అడ్వాన్స్ హార్డ్‌వేర్ ఫోన్ రూపొందించారు. ఫోన్ చీకట్లో ఉంచితే ఫోన్ వెనక భాగంలో కొంత మొత్తం పచ్చరంగులో కనిపిస్తుంది. దీనికి ఎలాంటి పవర్ సోర్స్‌తో పని లేదు. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కాన్ఫిగరేషన్ విషయానికొస్తే.. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ తెరను ఏర్పాటు చేశారు. వెనక రెండు, ముందు ఒకటి.. మొత్తం మూడు 50 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ర్యామ్ 12 జీబీ. స్టోరేజ్ సామర్థ్యం 256 జీబీ. బ్యాటరీ కెపాసిటీ 5,000 ఏఎంహెచ్. ఓఎస్ ఆండ్రాయిడ్ ఓఎస్14 వెర్షన్‌తో పని చేస్తుంది.
ధర: రూ.29,999
దొరుకు చోటు: ttps://acesse.dev/S0TF8
వేలకు వేలు పోసి కొనే స్మార్ట్ఫోన్లు భద్రంగా వాడతాం. స్క్రీన్ గార్డ్.. స్ట్రాంగ్ పౌచ్‌ని తొడిగేస్తాం. వాటితోపాటు ఇదిగోండి ఈ ‘ఫింగర్ గ్రిప్ అండ్ మొబైల్ హోల్డర్’ని కూడా వాడండి. మొబైల్ సేఫే కాదు.. కంఫర్టబుల్‌గా వాడొచ్చు. చాలా సింపుల్‌గా దీన్ని ఫోన్ వెనక అతికిస్తే చాలు. ఫోన్‌కి గట్టిగా అతుక్కుంటుంది. ఇక అంతే.. వేలు గ్రిప్‌లోకి వెళ్తుంది. ఇక ఎలాంటి కండీషన్స్ లోనైనా ఫోన్ కిందపడదు . ఇంకా చెప్పాలంటే.. దీన్ని ఫోన్ స్టాండ్‌లా కూడా అమర్చుకోవచ్చు. సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఫోన్లు జారి పోకుండా చూసుకోవచ్చు. పలు రకాల డిజైన్స్‌తో వీటిని అందిస్తున్నారు. మీ స్టైల్‌కి తగిన గ్రిప్‌ని ఎంపిక చేసుకోవచ్చు.
ధర: రూ.500
దొరుకు చోటు: https://acesse.dev/RbrC0