Natu kodi | పిల్లలు నాటు కోడి తినొచ్చా?
Natu kodi | రుచిలో, పోషకాల్లో నాటుకోడి మాంసానికి సాటిలేదు. మటన్, సీఫుడ్, బ్రాయిలర్.. మాంసంతో చేసిన ఎన్ని వెరైటీ వంటలు తిన్నా నాటుకోడి కూర అనగానే లొట్టలేస్తుంటారు మాంసాహార ప్రియులు. పల్లెలో పుట్టిపెరిగిన వారికైతే ఊరుకోడి కూరంటే మహాప్రీతి. మటన్ ధరతో పోటీపడుతూ పల్లె, పట్నం తేడా లేకుండా అందరినీ ఊరిస్తున్న ‘నాటు’కబుర్లు…

ఒకప్పుడు తెలంగాణ గ్రామాల్లో ఎక్కడ చూసినా నాటుకోళ్లు, జాతి పుంజులే కనిపించేవి. పెరటి కోడి కూతతోనే పల్లెకు తెల్లారేది. ఇంటికి చుట్టమొస్తే మాంసం కొట్టుకు పరుగెత్తే పనేలేదు. గూట్లో కోడిని గుటుక్కుమనిపించే వాళ్లు. రానురాను తేలిగ్గా ఉడికిపోయే బ్రాయిలర్ కోళ్ల మాంసానికి అలవాటు పడటంతో ఊరి కోళ్లు కనుమరుగయ్యాయి.

బ్రాయిలర్ చికెన్‌తో పోలిస్తే, నాటుకోడి ఆరోగ్యానికి మంచిదని తేలడంతో నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. రుచిలేని బ్రాయిలర్ చికెన్, కొవ్వుపట్టిన మటన్, నిల్వచేసిన చేపలు తినేకన్నా.. హాయిగా నాటుకోడిని లాగించడమే మేలని భావిస్తున్నారు. కాబట్టే, మటన్ ధరకు ఏమాత్రం తీసిపోకున్నా నాటుకోడికే ఓటేస్తున్నారు. స్టార్ హోటళ్లు సైతం నాటుకోడి పులుసు-చిట్టిగారె, నాటుకోడి కూర-రాగి సంకటి అంటూ సంప్రదాయ కాంబినేషన్లతో ఊరిస్తున్నాయి. అంకాపూర్ చికెన్ రుచి ఎప్పుడో ఎల్లలు దాటింది.

ఆరోగ్యానికి ఏమాత్రం కీడుచేయని నాటుకోడి కూర పట్ల పట్టణ ప్రజలూ మక్కువ చూపుతున్నారు. నాటుకోడి బిర్యానీ, నాటుకోడి పులుసు, నాటుకోడి ఇగురు, నాటుకోడి పచ్చడి.. అన్ని రుచులనూ ఆస్వాదిస్తున్నారు. వంట ఆలస్యమైనా రుచి పక్కా!

నాటుకోడి మాంసంలో కొవ్వు శాతం తక్కువ. కాబట్టి ఏ వయసు వారైనా తినవచ్చు. పిల్లల ఎదుగుదలకు, కండరపుష్టికి సహకరిస్తుంది. దీన్లోని సెలీనియం కీళ్లనొప్పుల నివారణకు, నియాసిన్ గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ, ఒత్తిడిని తగ్గించడంలోనూ సాయపడతాయి.

నాటుకోడిని మంటపై కాల్చి వండటం వల్ల చర్మంలో నిల్వ ఉండే కొద్దిపాటి కొవ్వు కూడా కరిగి
పోతుంది. నిప్పులమీదే ఒక మోస్తరుగా ఉడకటంతో రుచి మరింత పెరుగుతుంది. క్రిమికీటకాలు, ఆకులు, గింజలు తిని పెరిగే నాటుకోడిలో పీచుపదార్థం అపారం. ఎక్కువసేపు ఉడికించడం వల్ల కూరలో వేసిన మసాలా దినుసులు బాగా మగ్గిపోయి కొత్త రుచినిస్తాయి.
ఆలస్యమెందుకు, ఈ ఆదివారం ఘాటైననాటు కోడికూరకు ఓటేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
sunnundalu | షుగర్ ఉన్నవాళ్లు సున్నుండలు తినొచ్చా?
Popcorn | పాప్‌కార్న్ తింటే ఇన్ని లాభాలా.. అవేంటో తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

