Isomalt Jewellery | ఈ నగలను ఎంచక్కా తినేయొచ్చు
Isomalt Jewellery | ఆభరణాలు దేనితో చేస్తారు? ఏముంది బంగారం, వెండి. రెండూ కాదంటే మరేదో లోహంతో. కానీ, ఇక్కడ కనిపిస్తున్న నగలేవీ ఆ కోవకి చెందవు.
Isomalt Jewellery | ఆభరణాలు దేనితో చేస్తారు? ఏముంది బంగారం, వెండి. రెండూ కాదంటే మరేదో లోహంతో. కానీ, ఇక్కడ కనిపిస్తున్న నగలేవీ ఆ కోవకి చెందవు. ఎందుకంటే ఇవన్నీ తియ్యతియ్యటి పంచదారతో తీర్చిదిద్దిన ఆభరణాలు. నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతాయి. ‘నగల్ని ఎక్కడైనా తింటారా!’ అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఈ సొమ్ముల్ని చప్పరించేయవచ్చు.
సృజన ఉండాలే కానీ బండరాయిని శిల్పంగా మలచడమే కాదు, చక్కెరతోనూ చక్కని నగలు తయారు చేయొచ్చని నిరూపిస్తున్నారు నేటితరం కన్ఫెక్షనిస్టులు. వంటకాల తయారీలో వాడే ఒక పదార్థంతో అందాల ఆభరణాలను ముస్తాబు చేస్తున్నారు వీళ్లు. ‘ఐసోమాల్ట్ జువెలరీ’గా పిలుస్తున్న ఈ మిఠాయిలు గబుక్కున చూస్తే నిజమైన నగల్లాగే కనిపిస్తాయి. వీటిలోని రాళ్లు కూడా పారదర్శకంగా కనిపిస్తూ.. సాధారణ రత్నాలను తలపిస్తాయి. ఈ తరహాలోనే లాకెట్లు, బ్రూచ్‌లు, గొలుసులు, ఉంగరాలు తదితర ఆకృతులు సృష్టించేస్తున్నారు.
అలా ఎలా..?
తియ్యటి నగల్ని తయారు చేసేందుకు మామూలు పంచదారకు బదులు ఐసోమాల్ట్గా పిలిచే ఒక ప్రత్యేకమైన చక్కెరను వాడతారు. పంచదారను అధిక ఉష్ణోగ్రతల దగ్గర వేడిచేసినప్పుడు అది పసుపు పచ్చగా మారుతుంది. కానీ ఐసోమాల్ట్ను ఎంత వేడిచేసినా తెలుపు రంగులోనే ఉంటుంది. దీనివల్ల పారదర్శకంగా గాజులా కనిపించే బీడ్స్, రత్నాల్లాంటి వాటిని రూపొందించడం సులువు. అలాగే, ఏ కొంత తేమ వాతావరణం ఉన్నా, పంచదారబంకగా మారుతుంది. ఐసోమాల్ట్తో ఈ ఇబ్బందీ తక్కువే. అందుకే నగల తయారీకి దీన్ని ఎంచుకుంటారు. ఈ రకం పంచదారను వేడిచేసి విభిన్న ఆకృతుల అచ్చులలో పోసి, వాటికి రంగులు అద్దుతారు. గొలుసుల్లాంటివి చేయడానికి కూడా ప్రత్యేకమైన అచ్చులు ఉంటాయి. ఎక్కువగా ఈ నగలను కేకులూ, పేస్ట్రీల అలంకరణలో వాడతారు. ఇక, ఈ పంచదార వల్ల షుగర్ లెవెల్స్ పెరగవు. అంటే, ఇవి షుగర్‌లెస్ క్యాండీల కోవలోకి వస్తాయి. మొత్తానికి ఈ ఉంగరాలను చప్పరించేయొచ్చు, గొలుసుల్ని గుటుక్కుమనిపించొచ్చు… అదన్నమాట సంగతి!

Read More :
“చీమలు, చెద పురుగులతో ఐస్‌క్రీమ్‌లు, పచ్చళ్లు.. మరెన్నో వెరైటీలు.. తింటే ఎన్నో లాభాలు !!”
ఫొటోలో కనిపిస్తున్నవి ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు కాదు.. ఇవి కొత్తరకం కేకులు !!
“Black Food | నల్లగా ఉండే ఇలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిదేనా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

