కరెంట్ మీటర్?
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో వరుస మ్యాచుల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసినబ్యాటర్గా ఇటీవల రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవరు? అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ఓ చిత్రంలో దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి ప్రధాన పాత్ర పోషించింది. త్వరలో విడుదల కానున్న ఆ సినిమా ఏది?
మీ జీకే.. ఓకేనా?
- ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో వరుస మ్యాచుల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసినబ్యాటర్గా ఇటీవల రికార్డు నెలకొల్పిన ఆటగాడు ఎవరు?
- అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ఓ చిత్రంలో దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి ప్రధాన పాత్ర పోషించింది. త్వరలో విడుదల కానున్న ఆ సినిమా ఏది?
- సంవత్సరానికి రూ. 17,500 కోట్ల ఆదాయంతో అత్యధిక వేతనం తీసుకుంటున్న వ్యక్తిగా జగ్దీప్ సింగ్ వార్తల్లో నిలిచారు. ఆయన స్థాపించిన సంస్థ ఏది?
- బెంగాలీ నాటక రంగంలో ప్రసిద్ధిచెందిన తొలితరం థియేటర్లలో కోల్‌కతాలోని స్టార్ థియేటర్ ఒకటి. దీనికి బెంగాలీ నాటక రంగం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన నటి పేరు పెట్టారు. ఆమె ఎవరు?
- ఏదో ఒక ప్రాధాన్యత ఉన్న అంశంపై దృష్టి కేంద్రీకరించే దిశగా ప్రతి కొత్త సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రత్యేకంగా ప్రకటిస్తుంది. 2025ను దేనికి ప్రత్యేకించారు?
- నూతన సంవత్సరం వేడుకల్లో కెన్యాలోని ఓ గ్రామంలో ఓ అంతరిక్ష వాహక నౌక వ్యర్థం ఊడిపడింది. అయితే, కృత్రిమ ఉపగ్రహాలు, వాహక నౌకల వ్యర్థాలు పేరుకుపోయి భూ దిగువ కక్ష్య భవిష్యత్తు ప్రయోగాలకు పనికిరాదు. దీన్ని విజ్ఞానశాస్త్ర పరంగా ఏమని పిలుస్తారు?
- సాధారణంగా చీర రెండు వైపులా ఒకే రంగులో, ఒకే డిజైన్‌లో ఉంటుంది. కానీ, భూదాన్ పోచంపల్లికి చెందిన ఓ చేనేత కళాకారుడు మాత్రం పట్టుచీరకు రెండు వైపులా రెండు రకాల డిజైన్లు, రెండు రకాల రంగులు కనిపించేలా నేసి అబ్బురపరిచాడు. అతను ఎవరు?
- 2025 కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ఓ నగరంలో 53 నిమిషాలపాటు ఆపకుండా పటాకులు కాల్చారు. 6,000 డ్రోన్లతో వివిధ రూపాలను ప్రదర్శించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఈ వేడుక ఎక్కడ జరిగింది?
- భారతదేశం 1974, 1998 సంవత్సరాల్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. వీటిలో కీలకపాత్ర పోషించిన భౌతికశాస్త్ర శాస్త్రవేత్త జనవరి 4న మరణించారు. ఆయన ఎవరు?
- 1945 ఆగస్ట్ 9న జపాన్ దేశంలోని నాగసాకి నగరంపై అమెరికా అణుబాంబు దాడి జరిపింది. అందులో బయటపడిన 93 ఏండ్ల వృద్ధుడు జనవరి 3న మరణించాడు. ఆయన పేరేంటి?
జవాబులు
1. విదర్భ క్రికెటర్ కరణ్ నాయర్ (విజయ్ హజారే ట్రోఫీలో ఈ ఘనత సాధించాడు.)
2. గాంధీ తాత చెట్టు
3. క్వాంటమ్ స్కేప్ (జగ్దీప్ సింగ్… ఫౌండర్, మాజీ సీఈవో)
4. బినోదిని థియేటర్ (బెంగాలీ తొలితరం నటి, రచయిత బినోదిని దాసి పేరుమీదుగా)
5. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ (అంతర్జాతీయ హిమనదాల సంరక్షణ సంవత్సరం)
6. కెస్లర్ సిండ్రోమ్
7. సాయిని భరత్
8. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుధాబి
9. రాజగోపాల చిదంబరం
10. షిగెమి ఫుకహొరి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

