మీ జీకే.. ఓకేనా?
1. ఒక్కరోజు వ్యవధిలో 11 లక్షల మొక్కలు నాటడం వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న నగరం ఏది?
2. ఎగిరే పక్షుల్లో అతి పొడవైన పక్షి సారస్ కొంగ. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. జూన్ 20 21 తేదీల్లో ఆ రాష్ట్రంలో సారస్ కొంగల సంఖ్యను లెక్కించారు. ఎన్ని ఉన్నాయని తేలింది?
3. ఈశాన్య భారతదేశ రాష్ట్రం మణిపుర్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలిసారి బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తి ఎవరు?
4. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను చెక్ దేశపు క్రీడాకారిణి బార్బరా క్రెజికోవా గెలుచుకుంది. ఫైనల్లో ఆమె ఎవరిని ఓడించింది?
5. ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడా రంగంలో యూరో కప్, కోపా అమెరికా టోర్నమెంట్లు ప్రతిష్ఠాత్మకమైనవి. ఇటీవల జరిగిన
ఈ పోటీల్లో ఈ ఏడాది ఏ దేశాలు విజేతలుగా నిలిచాయి?
6. భూమ్మీద మనం ఏ ప్రదేశంలో ఉన్నాం, మనం వెళ్లాల్సిన గమ్యస్థానం ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఉపగ్రహ నేవిగేషన్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అయితే, చంద్రుడిపైనా నేవిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు ఏ దేశం ప్రయత్నిస్తున్నది?
7. నవ్వు నాలుగు విధాల చేటు అనేది ఇప్పుడు పాత సామెత. మానసిక ఆరోగ్యం కోసం రోజులో కనీసం ఒక్కసారైనా
బిగ్గరగా నవ్వాలని ఓ దేశంలో ఒక ప్రాంతం ఏకంగా చట్టాన్నే తీసుకువచ్చింది. ఎక్కడ?
8. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు మొదలైన అంశాలపై పోరాటానికి ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కృషిచేస్తుంది. ఈ సంస్థకు రెండేండ్ల కాలానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహిళ ఎవరు?
9. తెలుగు సహా వివిధ భాషల్లో ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందిన తొలినటి ఎవరు?
10. ఎర్రసముద్రంలో జరిగిన రెస్క్యూ మిషన్‌లో సాటిలేని ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ‘ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ 2024’ పురస్కారానికి ఎంపికైన భారతీయ కెప్టెన్ ఎవరు?
జవాబులు
1. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్
2. 19,918
3. జస్టిస్ నాంగ్మేకపం కోటీశ్వర్ సింగ్
4. ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పావొలిని
5. స్పెయిన్ (యూరో), అర్జెంటీనా (కోపా అమెరికా)
6. చైనా
7. జపాన్‌లోని యమగట ప్రిఫెక్చర్
8. ఎలీసా డి ఆండా మద్రాజో
9. సాయిపల్లవి
10. కెప్టెన్ అభిలాష్ రావత్, ఆయన పనిచేసే మార్లిన్ లువాండా ఆయిల్ ట్యాంకర్ సిబ్బంది