కరెంట్ మీటర్
పోటీ పరీక్షల అభ్యర్థులు, విద్యార్థులకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన తాజా సంఘటనల గురించి ఇస్తున్నాం. విద్యార్థులు, అభ్యర్థులు చదువుకోండి.
1) 2027లో నిర్వహించే ఆసియా ఫుట్‌బాల్ టోర్నీకి ఏ దేశం వేదిక కానున్నది?
2) భారత వన్డే, టెస్టు సారథి శుభమన్ గిల్, భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ కలిసి ఇటీవల ‘ఉత్తమ ఫ్లేయర్’ అవార్డు సాధించారు. అయితే ఈ పురస్కారం పొందడం శుభ్‌మన్‌కు ఇది ఎన్నోసారి?
3) ట్రస్ట్ అడ్వైజరీ సంస్థ నివేదిక ప్రకారం ఇ-కామర్స్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ ఏది?
4) వయోజన విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఉల్లాస్’ పథకంలో భాగంగా దేశంలోనే వందశాతం అక్షరాస్యత సాధించిన తొలి కేంద్ర పాలిత ప్రాంతమేది?
5) వృద్ధుల హక్కుల రక్షణ, సంరక్షణ కోసం సమగ్రమైన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రమేది?
6) ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ‘ఫెర్న్వేర్’ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను
ఆప్యాయంగా ఆహ్వానించే స్నేహపూర్వక నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన నగరమేది?
7) టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి మన దేశ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య ఎంత?
8) భారత వాయుసేనకు ప్రత్యేకమైన ఉపగ్రహ కమ్యూనికేషన్ సామర్థ్యంతోపాటు నౌకాదళానికి భారీ టార్పిడోలు సమకూర్చుకునేందుకు రక్షణ శాఖ ఏయే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది?
9) విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత, మానవీయ విలువలను పెంపొందించే లక్ష్యంతో మంచితనంపై అకాడమిక్ క్రెడిట్ కోర్సును దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన విశ్వవిద్యాలయమేది?
10) నేపాల్ భారత రాయబారిగా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవలి కాలంలో ఎవరిని నియమించింది?
జవాబులు
1. సౌదీ అరేబియా
2. అయిదోసారి
3. అమెజాన్
4. లక్షద్వీప్
5. కేరళం
6. మెరిడా (మెక్సికో)
7. 111.4 కోట్లు
8. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (బెంగళూర్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (హైదరాబాద్)
9. ఐఐటీ హైదరాబాద్
10. సుధాకర్ దలేలా

Shubhman Gill

Air Force
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

