వృషభం
వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. పైఅధికారులతో సఖ్యతతో మెలుగుతారు. సహోద్యోగుల సహకారంతో పనులు నెరవేరుస్తారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చును. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఆలస్యం జరుగవచ్చు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. ఓపికతో పనులు చేస్తారు. ఉత్సాహంగా ముందుకు వెళతారు. అనవసరమైన తగాదాలకు దూరంగా ఉంటారు. మనసు నిలిపి, పనులు చేయడంతో మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారం సంతృప్తిగా ఉంటుంది. కొంత ఆలస్యంగా అయినా బాకీలు వసూలు అవుతాయి. స్థిరచరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది.
మిథునం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణతో పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తయినా శ్రమాధికం, ఖర్చు ఉండవచ్చును. అన్నదమ్ములు, బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమయస్ఫూర్తితో పనులు చక్కబెడతారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు పనులు అనుకూలించినా, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి.
కర్కాటకం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబసభ్యులతో సంతృప్తిగా కాలం గడుపుతారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. వాటిని సంయమనంతో పరిష్కరించుకుంటారు. అన్నదమ్ములు, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా ఖర్చులు ముందుకు వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.
సింహం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆస్తుల పంపకాల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు, సాహితీ
వేత్తలకు అనుకూల సమయం. కొత్త అవకాశాలు వస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు, పనులు ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల మూలంగా ఖర్చులు పెరిగినా.. పనులు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు, నిర్మాణరంగంలో ఉన్న వారికి ఉత్తమ సమయం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్య
కుటుంబ సౌఖ్యం ఉంది. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త అవకాశాలతో సంతృప్తిగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అందరి సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. వాహనాలు, భూముల మూలంగా ఖర్చులు ఉండవచ్చును. ఉద్యోగస్తులకు ఆఫీసులో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూల సమయం. పైచదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. వృథా ఖర్చులు పెరుగుతాయి.
తుల
విద్యార్థులు చదువులో రాణిస్తారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్థిరచరాస్తి విషయాల్లో చికాకులు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు శ్రమాధిక్యం. బంధు, మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. నూతన గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా సమస్యలు ఎదురైనా.. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సంగీత, సాహిత్య, కళాకారులకు కలిసివస్తుంది. ఆదాయం సంతృప్తిగా ఉంటుంది.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తుల విషయంలో వివాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూలమైన వారం. ఉద్యోగస్తులకు ఆఫీసులో మంచిపేరు వస్తుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే, అనవసరమైన ఆలోచనల మూలంగా అసంతృప్తి చెందుతారు. సంయమనంతో వ్యవహరించండి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. తద్వారా పనులు నెరవేరుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త పనుల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. అయినా చింతించాల్సిన పన్లేదు.
ధనుస్సు
పనులపై మనసు నిలుపుతారు. సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. రాజకీయ, కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు పెరగడంతో ముఖ్యమైన పనులు పూర్తిచేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. రాబడిని అంచనా వేసుకొని ఖర్చులు పెట్టడం మంచిది. అధికారులను ప్రసన్నం చేసుకోవడం మంచిది. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. మంచివారితో స్నేహం పెరుగుతుంది. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభవార్త. పారిశ్రామికవేత్తలకు, కర్షకులకు అనుకూల సమయం.
మకరం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచే స్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. ఖర్చులు పెరగడంతో ముఖ్యమైన పనులలో జాప్యం జరగవచ్చును. ఖర్చుల నియంత్రణ అవసరం. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఓపికతో పనులు చేస్తారు. స్నేహితులు, బంధువుల మూలంగా ఇబ్బందులు ఎదురు కావచ్చు. అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అయితే అధికారులు అండగా నిలుస్తారు. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కుటుంబ సభ్యులతో కాలం హాయిగా గడుపుతారు. భూముల విషయంలో తగాదాలు రావచ్చును.
కుంభం
ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయత్నాలు సంతృప్తిగా కొనసాగుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదురైనా పనులు సకాలంలో పూర్తవుతాయి. అయితే, కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. ప్రయాణాల మూలంగా అలసట, వృథా ఖర్చులు ఉండవచ్చును. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. తద్వారా కొన్ని ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చును. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో బరువు బాధ్యతలు, పనిభారం పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
మీనం
పాత బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా బలపడుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆలోచనలను సమయానుకూలంగా ఆచరణలో పెడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. వాహనం, భూములు కొనుగోలు చేస్తారు. బంధువర్గం, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఉత్పత్తి పెరుగుతుంది. ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసులలో సత్ఫలితాలు పొందుతారు. న్యాయ పరమైన సమస్యలను అధిగమిస్తారు. ధార్మిక, సేవా, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in