భారతీయ ధార్మిక సాహిత్యం… వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు ప్రధానంగా వెలువడింది. వీటిలో ఇతిహాసాలు, పురాణాల్లో మానవ స్వభావాలను, వాటి ఫలితాలను ప్రముఖంగా చిత్రించారు. అయితే, ఇవన్నీ నిజంగా జరిగాయా… అనే ప్రశ్న వస్తే చాలావరకు చారిత్రక సంఘటనలే నేపథ్యంగా ఉంటాయి.
ఆ తర్వాత కాలంలో ఎన్నో ప్రక్షిప్తాలు చోటుచేసుకున్నాయి. కాబట్టి, పౌరాణిక సాహిత్యాన్ని విచక్షణతో చదవాల్సి ఉంటుంది. రచయిత ఎమ్బీయస్ ప్రసాద్ ఇలాంటి ప్రయత్నం సాగిస్తూ తన ఆలోచనలను ‘పురాణ పరామర్శ’ ద్వారా పంచుకున్నారు. ఈ పుస్తకం చదివితే రామపట్టాభిషేకంలో దాగిన రాజకీయ కోణం, ఆదిపురుష్ సినిమా నేపథ్యంలో రాసిన హనుమంతుడి మాటతీరు, ‘ఆదిపురుష్ సమస్య’ వ్యాసాలు, వేదాల్లో ఏమున్నది, వేంకటేశ్వరస్వామి భార్యలెవరు,
విగ్రహారాధన తీర్థయాత్రలపై మహర్షి దయానంద సరస్వతి అభిప్రాయాలు, అమితాబ్ బచ్చన్ పేరు అర్థం, ఒక మతం వారు ఇంకో మతం ఆచారాలను ఎందుకు పాటిస్తారు, వాటిని ఏ కోణంలో చూడాలి మొదలైన వాటి విషయంలో మనకు వచ్చే సందేహాలకు హేతుబద్ధంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు రచయిత. బాపు రమణ ద్వయం తెరకెక్కించిన భాగవతానికి ప్రసాద్ వచన రచన కూడా ఇందులో పొందుపరచడం విశేషం. ‘పురాణ పరామర్శ’ చదివితే భారతీయ సాహిత్యం, వాటి వెనక ప్రజల్లో పెనవేసుకుపోయిన విశ్వాసాల ఆంతర్యాలు అర్థం చేసుకోవచ్చు.
రచన: ఎమ్బీయస్ ప్రసాద్
పేజీలు: 416, ధర: రూ. 250
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 90004 13413
రచన: జ్యోతి వలబోజు
పేజీలు: 141;
ధర: 150
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ప్రతులకు: ఫోన్: 80963 10140
రచన: కోడం పవన్‌కుమార్
పేజీలు: 100;
ధర: రూ. 100
ప్రచురణ: లయ పబ్లికేషన్స్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98489 92825
రచన: విల్సన్‌రావు కొమ్మవరపు
పేజీలు: 182;
ధర: రూ. 200
ప్రతులకు: ఫోన్: 89854 35515