e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home బతుకమ్మ మాది మూడంతస్తుల ఇల్లు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లాన్‌ ఎక్కడ వేసుకోవాలి?

మాది మూడంతస్తుల ఇల్లు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లాన్‌ ఎక్కడ వేసుకోవాలి?

మాది మూడంతస్తుల ఇల్లు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లాన్‌ ఎక్కడ వేసుకోవాలి?

మా ఇంటి తూర్పువైపు గోడను ఎదుటి ఇంటివాళ్లు చాలా ఎత్తులో కట్టారు. అదే మాకు ప్రహరీలా ఉంది. దీనికి పరిష్కారం సూచించండి? గొలుసు వెంకటేశ్వర్లు, కొండగట్టు

తూర్పుగోడ ఎత్తుగా ఉందని చెబుతున్నారు. అది మీ ఎదుటి ఇంటివారిది అయినప్పుడు, దానిని మీరు మార్చలేరు. ఆ గోడ మీ స్థలంలో లేదు కాబట్టి, దాని గురించి చింత అవసరం లేదు. మీ స్థలంలో తూర్పు అంచులో మీ ఇంటికి ప్రహరీ నిర్మించుకోవాలి. ఇందాక మీరు పేర్కొన్న గోడకు ఆనించి తూర్పు కాంపౌండ్‌ను మీకు కావాల్సిన ఎత్తులో కట్టించుకోండి. తూర్పును నిర్దేశించుకున్నప్పుడు పడమర దిశలోనూ తూర్పుకన్నా తక్కువ స్థలం వదిలి, ఎక్కువ ఎత్తులో ప్రహరీ నిర్మించాలి. అంతేకానీ, ‘ఎలాగూ ఎదుటి ఇంటివాళ్ల ప్రహరీ ఉంది కదా’ అని, తూర్పువైపు మనం కాంపౌండ్‌ నిర్మించాల్సిన అవసరం లేదని వదిలేయకూడదు. మన ఇంటి స్థలంలో సరిహద్దుల ప్రకారం, సొంతంగా కాంపౌండ్‌ వాల్‌ ఉండటం సర్వదా శ్రేయస్కరం. అప్పుడే మీ ఇల్లు స్వతంత్రమవుతుంది.

- Advertisement -

మాది మూడంతస్తుల ఇల్లు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లాన్‌ ఎక్కడ వేసుకోవాలి? ఆఫీస్‌ ఎక్కడ పెట్టుకోవాలి? సర్వెంట్‌ రూమ్‌ కట్టాలనుకుంటే, దాన్ని ఎక్కడ ఉండాలి? భానుమూర్తి, వరంగల్‌

కింది ఫ్లోర్లో కొంత పార్కింగ్‌కు వినియోగిస్తూ ఆఫీస్‌ స్థలం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నప్పుడు, కొన్ని నియమాలు ఉన్నాయి. మీ ఆఫీసు నైరుతి భాగంలో నిర్మించుకోవాలి. ఈ ప్రదేశంలో ల్యాండ్‌స్కేప్‌ ఉంచకూడదు. ఇక, సర్వెంట్‌ రూమ్‌ దక్షిణంలోగానీ, పడమర మధ్యలోగానీ కట్టుకోవచ్చు. ఆగ్నేయం, వాయవ్యం, అలాగే ఈశాన్య దిశలోనూ లాన్‌ వేసుకోవచ్చు. కానీ, గ్రౌండ్‌ ఫ్లోర్‌కన్నా లోతుగా చేసి ‘లాన్‌’ వేయవద్దు. ఆగ్నేయ, వాయవ్యాలలో గోతులు చేసుకోవద్దు. కిందిభాగంలో అయినా గృహం నక్ష (బ్లూప్రింట్‌) వదిలి మిగతా ఆవరణలో చెట్లు, పూలమొక్కలు గ్రీనరీ వర్క్‌ చేసుకోవడం మంచిది. ఇంటి అడుగు గృహ అవసరాలకు మాత్రమే వాడుకోవాలి.

ఇంటి మూడో అంతస్తులోని తూర్పు వైపు బాల్కనీలు కింది అంతస్తు బాల్కనీలకన్నా పెంచుకోవచ్చా? ఆ పై అంతస్తులోని తూర్పు బాల్కనీని మళ్లీ తగ్గించుకోవచ్చా? వసుంధర, ఆలేరు

తూర్పు-ఉత్తరం వైపు ఉండే బాల్కనీలు మీ ఇష్టానుసారం ‘అందం కోసమో’, ‘అవసరం కోసమో’ ఎలా పడితే అలా ముందుకు, వెనక్కి పెంచి- తగ్గించి కట్టుకోవద్దు. బాల్కనీల విషయంలో హెచ్చుతగ్గులుగా కనబడాలి అంటే, కింది బాల్కనీకన్నా ఆపై బాల్కనీలను వెనక్కి తగ్గించి కట్టుకోవచ్చు. కానీ, గ్రౌండ్‌ ఫ్లోర్‌ బాల్కనీకన్నా ఫస్ట్‌ఫ్లోర్‌ బాల్కనీ తూర్పువైపు ముందుకు పెంచవద్దు. ఒక నిర్దిష్టమైన కొలతతో అన్ని బాల్కనీలు తూర్పునకు సమానంగా ముందుకు ఉండొచ్చు. అలాగే, ఉత్తరం వైపుకూడా. ‘పడమర దక్షిణ’ దిశల్లోనూ ఇలాగే ఉండాలి. ఎన్ని అంతస్తులు కట్టినా బాల్కనీలు అన్ని వైపులా ఒకే విధంగా ఉండాలి.

మా వ్యవసాయ క్షేత్రానికి నైరుతిలో వీధిపోటు ఉంది. అటువైపు గేటు పెట్టుకోవచ్చా? వి.మల్లికార్జున్‌, కొంపల్లి

వ్యవసాయ క్షేత్రానికి వీధిపోటు ఎటువైపు వచ్చినా దానిని లోపలికి ‘యథాతథంగా’ తీసుకోవాల్సి ఉంటుంది. మీ భూమికి నైరుతిలో దక్షిణం వైపు పోటు వస్తే ఆ రోడ్డు వెడల్పు ఎంతుందో అంత వెడల్పుతో మీ భూమికి పడమర రోడ్డు వచ్చేలా మార్చుకోవాలి. ఆ వీధికి పశ్చిమ వాయవ్యం గేటు పెట్టండి. అలాగే, దక్షిణం మధ్యలో రోడ్డుపోటు వచ్చినా ఆ రోడ్డును అనుసరించి మీ వ్యవసాయ భూమిని రెండు భాగాలుగా చేస్తూ యథావిధిగా రోడ్డును లోపలికి తీసుకోవాలి. అంటే, బయట ఉన్న వీధిపోటును దారిలా మార్చుకోవడం వల్ల ఆ దోషం తొలిగిపోతుంది. వ్యవసాయ క్షేత్రం ఎలాగూ విశాలంగా ఉంటుంది కాబట్టి, ఈ పని సులభంగా చేయవచ్చు. ఇండ్ల స్థలాల విషయంలో ఇది కష్టతరమే!

సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాది మూడంతస్తుల ఇల్లు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లాన్‌ ఎక్కడ వేసుకోవాలి?
మాది మూడంతస్తుల ఇల్లు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లాన్‌ ఎక్కడ వేసుకోవాలి?
మాది మూడంతస్తుల ఇల్లు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లాన్‌ ఎక్కడ వేసుకోవాలి?

ట్రెండింగ్‌

Advertisement