e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home బతుకమ్మ వాస్తు

వాస్తు

వాస్తు

కింది పోర్షన్‌లో, తూర్పులో పూర్తి వాలు వదిలి పడమర భాగం మొత్తం బెడ్‌రూమ్‌ వేసుకోవచ్చా? లేదంటే ఆఫీస్‌ పెట్టుకోవాలా?l బట్టి సునీత, మేడిపల్లి

ఇల్లు వాడకాన్ని బట్టి దాని విభజన మారుతుంది. ప్రజాప్రతినిధులు, వైద్యులు, లాయర్లు వారివారి వృత్తులకు సంబంధించిన అవసరాల మేరకు గృహ నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది. తమను కలవడానికి వచ్చిన వారు కూర్చోవడానికి కింది పోర్షన్‌లో పెద్దహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. లాయర్లు క్లయింట్స్‌తో మాట్లాడటానికి, డాక్టర్లయితే పేషంట్లను చూడటానికి ప్రత్యేక గది కట్టుకోవచ్చు. కానీ, మీరు పడకగది అంటున్నారు. పూర్తి గృహానికి సంబంధించిన హాలు, బెడ్‌రూమ్‌లు, కిచెన్‌ పై పోర్షన్‌లో విభజన చేసుకున్నప్పుడు, కింది పోర్షన్‌ను ఏవిధంగానైనా విభజించుకోవచ్చు. మీరు అనుకున్నట్టుగా హాలు వెనుక గదిని ‘మల్టిపుల్‌’గా వాడుకోవచ్చు. అది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. ఎలా వాడుకున్నా తప్పులేదు.

ఇంటికి పడమర-దక్షిణం వైపు ‘సూరు’ (వాడని బాల్కనీ) తప్పకుండా వేయాలా?
బొంతు రాజమణి, హైదరాబాద్‌

ఇంటిమీద స్లాబ్‌ వేసేటప్పుడు, కింది గోడల కన్నా ఎక్కువగా ఉండేలా నిర్మించడం పరిపాటి. వాడని దిశలో అయినా కనీసం ఆరు అంగుళాల నుంచి రెండు అడుగుల స్లాబు వేయాలి. మనం పాత గృహాలను పరిశీలిస్తే పెంకుతో కూడిన కప్పులు ఇంటి గోడల కన్నా కొద్దిగా బయటకు విస్తరించి ఉండటాన్ని గమనించవచ్చు. ఇంటి కప్పు (స్లాబ్‌) డబ్బామూతలా గోడలకు సమానంగా వేయడం వల్ల ఎండ, వాన నుంచి రక్షణ లభించదు. తూర్పు, ఉత్తర దిశల్లో బాల్కనీలు పెద్దగా వేసుకొని, పడమర, దక్షిణ దిశల్లో కప్పును పెంచకపోతే ఇంటి ‘బ్యాలెన్స్‌’ కూడా దెబ్బతింటుంది. వాస్తులో గృహ సంబంధమైన ‘ఇంజినీరింగ్‌ విధానం’ కూడా ఇమిడి ఉంటుందని మరువకూడదు.

మెట్ల ‘ల్యాండింగ్‌’ ఇంటిపారు దాటి వెళ్లవచ్చా?l బి.శంకర్‌, మెట్‌పల్లి

చుట్టూ ఖాళీ వదిలి ఇల్లు కడుతున్నప్పుడు మెట్ల పొడవు గృహం మధ్యభాగాన్ని దాటి (తూర్పు లేదా ఉత్తరం) ముందుకు వస్తే.. ఆ మెట్ల ల్యాండింగ్‌ను పడమరలో గానీ, దక్షిణంలో గానీ వదిలిన స్థలంలోకి జరుపుకోవడం దోషం కాదు. అయితే, దక్షిణం-పడమర కాంపౌండ్స్‌ను దాటి బయటకు వెళ్లవద్దు. మన గృహం హద్దులోనే ల్యాండింగ్‌ ఇమిడి ఉండాలి. అలాగే ల్యాండింగ్‌ మీద కట్టే రేలింగ్‌ (పిట్టగోడ) ఇంటి ఉత్తరం గోడపారుకు సమానంగా రావాలి. మెట్లు ఉత్తర-వాయవ్యంలో వేసినపుడు, మెట్లు తూర్పు-ఆగ్నేయంలో వేస్తే ఆ ల్యాండింగ్‌ మీది రేలింగ్‌ తూర్పు గోడపారుకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాండింగ్‌ బయటకు వెళ్లినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అవసరం అవుతాయి.

కూతురు, అల్లుడు మా ఇంటి పైపోర్షన్‌లో నివాసం ఉండకూడదని చెబుతున్నారు! నిజమేనా?l రాంరెడ్డి, జగిత్యాల

‘మనసును బట్టి మాటలు’ చెబుతుంటారు. అవన్నీ శాస్త్ర వచనాలు అనుకోవద్దు. పెద్దవాళ్లు అనగానే చాలామందికి ఎత్తుకు సంబంధించిన భావన కలుగుతుంటుంది. కానీ, గృహంలో భూమిని ఆధారంగా చేసుకొని పెద్దవాళ్లు నివాసం ఉండటంలో పెద్దతనం ఉంటుంది. మీరు.. మీ అల్లుడు, కూతురు కోసం ఇంట్లో ఏ పోర్షన్‌ కేటాయించినా ఇబ్బందిలేదు. అలాగని యజమానిగా మీరు కింది పోర్షన్‌ వాడుకోవాలి. కొడుకైనా, అల్లుడైనా మీరు కుటుంబ యజమానిగా ఉన్నప్పుడే వాళ్లంతా తోడయ్యారు. కాబట్టి, కేటాయింపులో మీరే (కుటుంబ పెద్ద) ప్రధానం. అంతేకానీ, అల్లుడిని గౌరవించాలని మీరు ఉంటున్న పోర్షన్‌ను ఖాళీ చేయాల్సిన పనిలేదు. మీ ఇంటి పైపోర్షన్‌లో దోషాలు లేకుండా చూసి వాళ్లకు అప్పగించండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాస్తు

ట్రెండింగ్‌

Advertisement