వర్షకాలం వచ్చిందంటే చాలు చెప్పులు, షూ మీద బురద, మట్టి, మురికినీళ్ల మరకలు పడుతుంటాయి. ఇప్పుడిక ఆ భయం అవసరం లేదు. వెట్రో పవర్ సంస్థ తయారుచేసిన ఫుట్వేర్ ప్రొటెక్టర్తో పాదరక్షల మీద మరకలు పడకుండా కాపాడుకోవచ్చు. దీన్ని చెప్పులు, షూపై స్ప్రే చేయగానే పారదర్శకంగా ఉన్న ఒక పొరలాగా అమరిపోతుంది. ఈ స్ప్రే వేశాక బురద, నీళ్లు, కాఫీ, టీ, ఆల్కహాల్.. ఏది ఒలికినా మరక మాత్రం పడదన్నమాట. దీన్ని లెదర్, ఊలు, ఫ్యాబ్రిక్, నైలాన్, సింథటిక్ సహా అన్నిరకాల పాదరక్షలకూ వాడవచ్చు. ఆన్లైన్ ధర రూ. 999 (250 మి.లీ).