కరోనా కారణంగా ఏదైనా ముట్టుకుంటే ఒకటికి రెండుసార్లు చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం అలవాటైపోయింది. ఇక చెత్తడబ్బా సంగతి చెప్పనక్కర్లేదు. రుద్దిరుద్ది చేతులు అరగాల్సిందే. అయితే, అసలు ముట్టుకోనక్కర లేకుండా చెత్తను డబ్బాలో వేసే అవకాశం ఉంటే? అదుర్స్ కదా! అందుకోసమే వచ్చేసింది.. సోబర్ సెన్సర్ డస్ట్‌బిన్. ఒబెల్లా కంపెనీ రూపొందించిన ఈ డబ్బా సెన్సర్‌తో పనిచేస్తుంది. ఎవరైనా దగ్గరికి వస్తున్నట్టు సిగ్నల్ అందితే చాలు, ఆటోమెటిగ్గా మూత తెరుచుకుంటుంది. అందులో చెత్త వేయగానే మళ్లీ మూసుకుంటుంది. అంతేకాదు ఈ స్మార్ట్ బిన్ బ్యాక్టీరియా, వైరస్‌లను అరికడుతుంది. ఫైబర్‌తో రూపొందించిన ఈ ఆధునిక డస్ట్‌బిన్ ఎక్కడైనా ఇట్టే అమరిపోతుంది. దీని ఆన్లైన్ ధర రూ. 12,999.