వంటింట్లో బొమ్మల కొలువు!
లేవగానే వేడి వేడి చాయ్... రుచి కరంగా బ్రేక్ ఫాస్ట్... పొగలుకక్కే అన్నం... అన్నీ వంటింట్లోనే తయారవుతాయి. ఆత్మారాముణ్ని శాంతపరిచే క్రతువుకు అదే వేదిక. మరి, అది మాత్రం అందంగా ఎందుకు కనిపించకూడదు.
లేవగానే వేడి వేడి చాయ్… రుచి కరంగా బ్రేక్ ఫాస్ట్… పొగలుకక్కే అన్నం… అన్నీ వంటింట్లోనే తయారవుతాయి. ఆత్మారాముణ్ని శాంతపరిచే క్రతువుకు అదే వేదిక. మరి, అది మాత్రం అందంగా ఎందుకు కనిపించకూడదు. దీపావళికో, దసరాకో పెట్టినట్టు వంట గదిలోనూ బొమ్మల కొలువు ఎందుకు ఉండకూడదు… అనుకున్నారేమో డిజైనర్లు, వంటింటి వస్తువుల్నే బొమ్మల్లా తీర్చిదిద్దుతున్నారు.
బొమ్మలంటే ఓ రకమైన అందం. వాటిని చూస్తే మనసుకు ఆనందం. అందుకు పసిపిల్లలే కానక్కర్లేదు. పెద్దలకూ అవంటే ముచ్చటే. పండుగ వేళల్లో బొమ్మల కొలువులు అందర్నీ ఆకర్షించడం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మరి మనకు నచ్చిన ఏ గుత్తి వంకాయ కూరో వండుకుంటేనో, కమ్మటి పాయసాన్ని వేడి వేడిగా సిద్ధం చేసుకుంటేనో.. అది కూడా పొట్టకి పండగేగా. అలాంటి చోటా బొమ్మల కొలువును ఏర్పాటు చేసే అవకాశాన్నిస్తాయి ‘డాల్ లైక్ కిచెన్ యుటెన్సిల్స్’. ఇందులో టీ సెట్ నుంచి స్క్రబ్ హోల్డర్ దాకా ఎన్నో వెరైటీలున్నాయి.

Kitchen Doll 1
ముచ్చటగా…
వంటిల్లంటే అదో సామ్రాజ్యం. అందులో ఎన్ని వస్తువులు కావాలో. ఒక్కటి లేకపోయినా పని కాదు. వాటన్నిటినీ జాగ్రత్తగా సర్దడం అందుబాటులో ఉంచుకోవడం ఇల్లాలి వంతే. అవి కూడా పొందికగా ఉంటేనే వంటిల్లు చూడచక్కగా ఉంటుంది. దాన్ని మరింత ముచ్చటగా చేసే ఈ బొమ్మల తరహా వస్తువుల్లో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి.
ఒక దాని మీద ఒకటి పెడితే బొమ్మలా కనిపించే కెటిల్ కప్పులు, ఉప్పు పప్పుల డబ్బాలన్నీ తన పొట్టలో ఇముడ్చుకొనే జిరాఫీ ర్యాక్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ పెట్టుకుని తినేలా ఉండే బాతు కటోరాలు, ఒక వరుసలో పెడితే కుక్క బొమ్మను తలపించే ఫ్రూట్ బౌల్స్… ఇలా ఒకటా రెండా కిచెన్‌ను కళకళలాడేలా చేసే వెరైటీలు ఎన్నెన్నో. అంతెందుకు, పచ్చ సొనను వడకట్టేదీ, అంట్ల పీచును పెట్టుకునేదీ కూడా అందమైన బొమ్మల్లే మారిపోతే ఎంత బాగుంటుందో కదూ! పింగాణీ, చెక్క, ప్లాస్టిక్‌లాంటి వాటిలో ఇవి రూపొందుతున్నాయి. మన ఇష్టాన్ని బట్టి నచ్చిన మెటీరియల్, మెచ్చిన వస్తువును ఎంచుకుంటే… మనదైన ైస్టెల్లో కొలువును సిద్ధం చేయొచ్చు!

Kitchen Doll 2

Kitchen Doll 3

Kitchen Doll 4

Kitchen Doll 5

Kitchen Doll 6

Kitchen Doll 7

Kitchen Doll 8
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

