శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Apr 12, 2020 , 00:33:47

రాశి ఫలాలు

రాశి ఫలాలు

 మేషంవృత్తి, వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. పనులు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ఆదరణ ఉంటుంది.  ప్రమోషన్‌ లభిస్తుంది.  సమాజంలో గౌరవం పెరుగుతుంది.ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. పనుల వల్ల డబ్బు వస్తుంది. లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వారం కొత్త పనులు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. కొత్త పెట్టుబడులు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో మంచి సంబంధాలు ఏర్పడతాయి.


వృషభంపనుల పురోగతిలో కొంత ఆలస్యం ఉండవచ్చు. శ్రద్ధతో పనులు చేయడం  ఈవారం చాలా అవసరం.  అనుభవజ్ఞులు, పెద్దలతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం కోసం ప్రయత్నించాలి.  గిట్టని వారితో, వ్యాపారంలో పోటీ దారులతో ఇబ్బందులుంటాయి.  అనాలోచిత పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది.  దీర్ఘకాలిక పనుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.  పూర్వంతో పోల్చితే వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి.   ఇంట్లో కలహాలకు దూరంగా ఉండటం మంచిది. 


మిథునంవృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఉంటాయి. లక్ష్య సాధనకు సరైన మార్గం ఎన్నుకోవడం చాలా ముఖ్యం. పెద్దలు, అనుభవజ్ఞులతో వాగ్వివాదాలు ఉంటాయి. ఆఫీసులో అధికారులతో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పుకోవడం మంచిది. నలుగురితో విచారించి పనులు చేయాలి.సమాజంలో  స్నేహితులు, బంధువులతో మనస్పర్థలు ఉంటాయి. పెట్టుబడులను వాయిదా వేసుకోవడం అన్ని విధాలుగా మంచిది.   కుటుంబ సమస్యలుంటాయి. అవి జాగ్రత్తతో పరిష్కరించుకోవాలి. మంచి పరిచయాల వల్ల ప్రశాంతత ఉంటుంది. 


కర్కాటకంప్రారంభించిన పనుల్లో విజయాన్ని పొందుతారు. అనుకున్న సమయంలో అవి పూర్తవుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులు  కొత్త ఒప్పందాలను, కొత్త పనులను చేపడతారు. అనుకూల ఫలితాలు ఉంటాయి.   నలుగురిలో గుర్తింపును పొందుతారు. అందరిపై పై చేయిని సాధిస్తారు. పోటీదారులతో లాభాలు ఉంటాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం సమకూరుతుంది. రావాల్సిన డబ్బు వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా పిల్లలు అనుకున్నది సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి.  ఇంటిలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.


సింహంఆలోచనలు స్ఫురిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. రావాల్సిన డబ్బు వస్తుంది. పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో మంచి సంబంధాలు ఉంటాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. నిర్మాణ రంగాలలో ఉన్న వారికి ఆదాయం కలిసి వస్తుంది. వ్యవసాయ దారులకు అనుకూలమైన వారం. ఇరుగు పొరుగు వారితో సంబంధాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు తోటి వారితో, పై అధికారులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇంటిలో అనవసరమైన చర్చలకు తావులేకుండా చూసుకోవడం మంచిది. 


కన్య


వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాలపై మనసు నిలుపుతారు. కొత్త వ్యాపారాలు, కొత్త పనులు చేయడానికి అనుకూలమైన సమయం.డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలకు అనుకూల సమయం. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల ఆదరణ ఉంటుంది.  వ్యక్తిగత జీవితంలో అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం  మంచిది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు.


తులఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.  వృత్తి, వ్యాపారం కొంత వరకు అనుకూలంగా ఉన్నా రాబడి అనుకున్నంత ఉండక పోవచ్చును. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి.  కుటుంబ సభ్యులతో సంతృప్తిగా వుంటారు. సంగీత, సాహిత్య, సినిమాలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మికత పెంపొందించుకుంటారు.  ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. శాశ్వత ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలి. 


వృశ్చికంఉద్యోగులకు తోటివారితో అనుకూలత ఉంటుంది. ఆఫీసు పనులను ఉత్సాహంతో చేస్తారు. రావాల్సిన డబ్బు వస్తుంది. కొత్త పెట్టుబడులకు ప్రయత్నం చేస్తారు. పనివారితో అనుకూలత ఉంటుంది. స్నేహితులు, బంధువులతో చర్చలు ఫలిస్తాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.  పెద్దలు, అనుభవజ్ఞుల సహాయ సహకారాలు తీసుకోవడం అవసరం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు.  అనవసరమైన ఆలోచనలను వదిలిపెట్టాలి. 


ధనుస్సువివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిత్య వ్యాపారం,  స్వయంవృత్తి లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. రాబడి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పెద్దల సహాయ సహకారాలు, సూచనలకు ప్రాధాన్యతనిస్తారు. పనివారితో అనుకూలత ఉంటుంది.   ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల వద్ద మంచి పేరు సాధిస్తారు.  రాజకీయంలో ఉన్న వారి నాయకుల తోడ్పాటు బాగా ఉంటుంది.           ఆరోగ్య విషయాలపై శ్రద్ధ నిలుపుతారు. 


మకరం


కొన్ని ప్రతికూల పరిస్థితులున్నాయి.  పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగకపోవడం గమనిస్తారు. పిల్లల విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి.  కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమాలపై మనసు నిలుపుతారు. కొత్త వారి పరిచయాల కోసం ప్రయత్నిస్తారు. పెద్దల సహాయ సహకారాలు, సూచనలు  పాటించాలి.  అయితే ఆరోగ్యపరమైన సమస్యలు తీరుతాయి. మంచి ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. దీర్ఘ కాలిక పనులు చేయడం గురించి ఆలోచించాలి. 


కుంభం


నిత్య వ్యాపారం లాభిస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహరాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఆఫీసు పనులు ఉత్సాహంతో చేస్తారు. కుటుంబ సభ్యులందరితోనూ సంతృప్తిగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమాలపై శ్రద్ధ చూపిస్తారు. పెద్దలు, తల్లిదండ్రుల సూచనలకు ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాలపైప మనసు నిలుపుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండవచ్చును. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి తాత్కాలిక వెసులుబాటు ఉంటుంది. 


మీనంకుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడుపుతారు. రావాల్సిన డబ్బు అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. సమస్యలు తీరుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. గృహ నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో ఉండేవారికి వారాంతంలో అనుకూలిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. దైవ భక్తి పెరుగుతుంది. సంగీత, సాహిత్య, సినిమాలపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి వారాంతం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. పనివారితో సమస్యలు తీరుతాయి.