మేషం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్థులు పైఅధికారుల మన్ననలు పొందుతారు. పదోన్నతి పొందవచ్చు. వ్యాపారస్థులు కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులకు అనుకూల వారం. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచివారితో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీలు లాభాలనిస్తాయి. కళాకారులకు మంచి సమయం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
వృషభం
అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వర్తిస్తారు. బంధుమిత్రులతో కార్యసాఫల్యం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని పనులలో వృథా ఖర్చులు ఉంటాయి. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూల వారం. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేస్తారు. విద్యార్థులకు అనుకూల వారం. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
మిథునం
ఉద్యోగంలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తితో పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగులు, పై అధికారులతో సఖ్యతతో మెలగడం అవసరం. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో అసహనానికి గురవుతారు. తీర్థయాత్ర, ఆలయ సందర్శన ఆలోచనలు ఫలిస్తాయి. ఈ వారం కొత్త పనులను ప్రారంభించకుండా, చేతిలో ఉన్నవి పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. వ్యవసాయదారులకు మంచి వాతావరణం. ఇరుగుపొరుగుతో తగాదాలు పరిష్కారం అవుతాయి.
కర్కాటకం
పనిచేసే చోట సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా మెలుగుతారు. పదోన్నతి లభించవచ్చు. అన్నదమ్ములు, బంధువర్గం చొరవతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూ లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారస్థులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురికీ సాయపడతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూల వారం. కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి.
సింహం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించడంపై మనసు నిలుపుతారు. నలుగురి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహార యాత్రల ప్రణాళికలు ఫలిస్తాయి. కళాకారుల ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. బంధువర్గంతో పనులు నెరవేరినా.. చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారులకు అనుకూల వారం. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కన్య
ఈ వారం ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువర్గం, స్నేహితులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. కార్య సాఫల్యం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయ పరమైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగస్థులకు పనులలో బాధ్యత పెరిగినా.. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంగీత, సాహిత్య కళాకారుల ఆదాయం పెరుగుతుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల వారం. ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంది. ఆదాయం పెరుగుతుంది.
తుల
ప్రారంభించిన పనులు ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం అవుతాయి. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పనులలో బరువు, బాధ్యతలు, శ్రమ పెరుగుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్థులకు ఆఫీస్లో పనిభారం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. పట్టుదలతో పనులను పూర్తిచేయడం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. అయితే, వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెంచుకోవడం అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువర్గం మూలంగా ఖర్చులు పెరగవచ్చు. భూముల కొనుగోలు, ప్రయాణాలు వాయిదా పడతాయి.
వృశ్చికం
ఉద్యోగస్థులు సంతృప్తిగా ఉంటారు. సంతోషంతో పనులు పూర్తిచేస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక స్థితి సంతృప్తిగా ఉంటుంది. గత పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది.
ధనుస్సు
మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూల వారం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. అలసట లేకుండా నిరంతరం శ్రమతో పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. పనిలో బాధ్యతలు పెరిగినా సంతోషంగా స్వీకరిస్తారు. సమర్థంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మీయులు, బంధువర్గం చొరవతో పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలకు ఈ వారం అనుకూలం. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.
మకరం
తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లోకి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సహోద్యోగులతో సంబంధాలు పెంపొందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. స్థిర చరాస్తుల విషయంలో ఉన్న తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు. రావలసిన డబ్బు చేతికి అందకపోవడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన వారం.
కుంభం
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తద్వారా ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. పని భారం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే, చిన్నచిన్న వివాదాల మూలంగా మనశ్శాంతిని దూరం చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయ పరమైన సమస్యలను అధిగమిస్తారు. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఖర్చుల నియంత్రణ, వివాదాలకు దూరంగా ఉండటం ఈ వారం అవసరం.
మీనం
కొత్త పనులు ప్రారంభిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. తీర్థయాత్రలు, నదీస్నానాలు చేస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగస్థులకు ఆఫీసులో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తోటి ఉద్యోగులు, అధికారుల సహకారం లభిస్తుంది. బంధువర్గంతో సంబంధాలు పెంపొందుతాయి. వాహనం మూలంగా కలిసి వస్తుంది.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in