మేషం
తలపెట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. బాధ్యతలు పెరిగినా, పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఉన్నత చదువులకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పైఅధికారుల ఆదరణ లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ప్రతిఫలాలు అందుతాయి. వృథా ఖర్చుల మూలంగా పనుల్లో ఆలస్యం జరుగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యులతో సమయం గడుపుతారు. స్నేహ బంధాలు పెరుగుతాయి. అయితే, అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది.
వృషభం
ఉద్యోగస్తులకు నలుగురి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయికతో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనులలో శ్రమాధిక్యము ఉంటుంది. ఇంటా బయటా వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంయమనంతో పనులు చేయాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటూ, చేసే పనిపై దృష్టి నిలిపితే సత్ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటారు. పాతబాకీలు వసూలు అవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాధ్యతలు పెరిగినా, సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు.
మిథునం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అన్నదమ్ములు, బంధువులు సహకారంతో పనులు చక్కబెడతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా చికాకులు ఉన్నా, వ్యాపారం లాభసాటిగానే ఉంటుంది. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. అయితే, కొన్ని ముఖ్యమైన పనుల్లో జాప్యం జరుగవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో సత్సంబంధాలు ఏర్పడుతాయి. ఉత్పాదన పెరుగుతుంది. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాల కారణంగా ఖర్చులు పెరుగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయాలి.
కర్కాటకం
పూర్వం పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం వస్తుంది. కోర్టు వివాదాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. తలపెట్టిన ప్రయాణాలు సాఫీగా కొనసాగుతాయి. లాభదాయకంగా పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు ఆదాయం సమకూరుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు ఆఫీస్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యంగా అయినా చేతికి అందుతుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుపై నియంత్రణ కొనసాగిస్తారు. ఏకాగ్రతతో పనులు చక్కబెడతారు.
సింహం
స్థిర, చరాస్తుల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. రాబడి సంతృప్తికరంగా ఉండటంతో కొత్త పనులు ప్రారంభించే యోచన చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లావాదేవీలు జయప్రదంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. అధికారులు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి వారి మెప్పును పొందుతారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.
కన్య
ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సూచనలతో పనులు నెరవేరుతాయి. స్నేహితుల మూలకంగా ధనవ్యయ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పైఅధికారుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసులు, రాజకీయ, ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరిగినా, ఫలితాలు అనుకూలంగా వస్తాయి. అనవసర వివాదాల జోలికి వెళ్లకపోవడం మంచిది. విద్యార్థులకు అనుకూల సమయం. వృత్తి, వ్యాపారాల్లో అందరి సహాయ, సహకారాలు అందుతాయి. స్థిరాస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈ వారం ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వాహనాల వల్ల ఖర్చులు పెరుగవచ్చు.
తుల
నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగుల సహకారం పొందుతారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో తగాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పనులు సకాలంలో నెరవేరినా, శ్రమ అధికం కావచ్చు. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. భూములు, వాహనాలు కొనుగోలుకు అనుకూల సమయం. నిర్మాణ రంగంలో ఉన్నవారు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక సమస్యలున్నా, ఉత్సాహంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు, ఆర్థిక ఒప్పందాలకు అనుకూల సమయం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
వృశ్చికం
ఆస్తి తగాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగవచ్చు. వ్యాపార కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి పరమైన ఇబ్బందులు ఉన్ననూ, ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. సమస్యలను ఓపికతో పరిష్కరించుకుంటారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన అడ్డంకులను అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం.
ధనుస్సు
ప్రయాణాలు కలిసివస్తాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. శ్రమ పెరిగినా, అందుకు తగ్గ ఫలితం పొందుతారు. వృథా ఖర్చుల కారణంగా ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆదాయంలో కొంత అస్థిరత ఏర్పడవచ్చు. అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. పట్టుదలతో పనులు చక్కబెట్టి పైఅధికారులను సంతృప్తి పరుస్తారు. కుటుంబసభ్యులతో హాయిగా కాలం గడుపుతారు. వస్తువుల కొనుగోలులో జాప్యం జరుగవచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు.
మకరం
తలపెట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసరమైన ఖర్చుల వల్ల కొన్ని పనుల్లో ఆలస్యం జరుగవచ్చు. అయితే, పట్టుదలతో, ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. కొన్ని విషయాల్లో వివాదాలు ఏర్పడవచ్చు. సహోద్యోగులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పనుల్లో బరువు, బాధ్యతలు పెరిగినా, సకాలంలో పూర్తి చేసి అధికారులను మెప్పిస్తారు. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
కుంభం
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. దైవసేవ, గురుసేవతో మానసిక ప్రశాంతత పొందుతారు. నలుగురి సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదురైనా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త పనులు కాకుండా గతంలో ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. అనవసరమైన ప్రయాణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనాల కారణంగా ధన వ్యయ సూచన. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. అయితే, బంధువుల రాకతో ఖర్చులు పెరుగవచ్చు. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విదేశీ ప్రయాణాలు వాయిదాపడుతాయి. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు.
మీనం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. సరైన ఆలోచనలు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల రాకతో ఇంట్లో సందడిగా ఉంటుంది. ఇరుగు పొరుగువారితో అనుబంధం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కలిసివస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే పనులు సఫలం అవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు చేస్తారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపార భాగస్వాముల సహకారం లభిస్తుంది. వారి సూచనలు బాగా కలిసి వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలు చేస్తారు.