Zimbabwe | బులవాయో: అంతర్జాతీయ క్రికెట్లో అనామక జట్టుగా ఉన్న జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ పరాభవం పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బులవాయో వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే.. 80 పరుగుల తేడా(డక్వర్త్ లూయిస్ పద్ధతిలో)తో గెలిచింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన పాక్.. వర్షం కురిసే సమయానికి 21 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 60 పరుగులకే పరిమితమైంది.