ముంబై: భారత మాజీ దిగ్గజ బ్యాటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh).. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏడు భారీ సిక్సర్లను కొట్టాడు. ఆ మ్యాచ్‌లో అతను 30 బంతుల్లో 59 రన్స్ చేశాడు. దాంట్లో ఏడు సిక్సులతో పాటు ఓ బౌండరీ కూడా ఉన్నది. 2008 టీ20 వరల్డ్‌కప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో కొట్టిన సిక్సర్లను .. తాజా హిట్టింగ్తో యువీ గుర్తు చేశాడు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ మెక్‌గెయిన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 42 రన్స్ చేశాడు. సచిన్ ఇన్నింగ్స్‌లో ఏడు బౌండరీలు ఉన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 220 రన్స్ చేసింది.
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు పవర్‌ప్లేలోనే మూడు వికెట్లను కోల్పోయింది. షేన్ వాట్సన్, షాన్ మార్ష్‌లు స్వల్ప స్కోర్లకే నిష్క్రమించాడు. షాబాద్ నదీమ్ 15 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 126 పరుగులకే ఆలౌటైంది. 94 రన్స్ తేడాతో ఇండియన్ మాస్టర్స్ జట్టు గెలిచింది. రెండవ సెమీఫైనల్లో శ్రీలంక మాస్టర్స్ జట్టు ఇవాళ వెస్టిండీస్ మాస్టర్స్‌తో తలపడనున్నది.
𝐘𝐮𝐯𝐫𝐚𝐣’𝐬 𝐬𝐢𝐱-𝐬𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 5️⃣0️⃣! 💪
His powerful display leads him to a remarkable half-century! ⚡🙌
Watch the action LIVE ➡ on @JioHotstar, @Colors_Cineplex & @CCSuperhits! #IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/QhJRdyh4zu
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 13, 2025