BCCI Women : వన్డే వరల్డ్‌కప్ విజేత భారత జట్టు తొలి విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఇటీవలే శ్రీలంకను వైట్‌వాష్ చేసిన టీమిండియా.. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటన (Australia Tour)కు వెళ్లనుంది. ఇష్పటికే షెడ్యూల్ ఖరారు కావడంతో ఆదివారం వన్డే, టీ20లకు స్క్వాడ్‌ను ప్రకటించారు సెలెక్టర్లు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన డిప్యూటీగా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ఈమధ్యే శ్రీలంకపై తిప్పేసిన వైష్ణవీ శర్మ (Vaishnavi Sharma) వన్డే, టీ20లకు ఎంపికవ్వగా.. డబ్ల్యూపీఎల్‌లో చెలరేగి ఆడుతున్న గుజరాత్ జెయింట్స్ హిట్టర్ భారతి ఫుల్మాలి (Bharati Pulmali) టీ20 స్క్వాడ్‌లోకి వచ్చింది.
శ్రీలంకపై వికెట్లతో మెరిసిన వైష్ణవీ శర్మ వన్డే, టీ20 స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో భారీ సిక్సర్లతో రెచ్చిపోతున్న భారతి ఫుల్మాలి జాతీయ జట్టులోకి తొలిసారి ఎంపికైంది. డబ్ల్యూపీఎల్‌లో వికెట్లే వేట కొనసాగిస్తున్న శ్రేయాంక పాటిల్ పొట్టి ఫార్మాట్ స్క్వాడ్‌లోకి దూసుకొచ్చింది. వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా.. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న అమన్‌జోత్ కౌర్ రెండు ఫార్మాట్లకు ఎంపికైంది. అయితే.. ఏకైక టెస్టుకు స్క్వాడ్‌ను ప్రకటించాల్సి ఉంది.
Presenting #TeamIndia’s squad for ODI & T20I series against Australia Women 🙌
Details ▶️ https://t.co/UCScQnfJdi#AUSvIND pic.twitter.com/afB4dqfNco
— BCCI Women (@BCCIWomen) January 17, 2026
భారత వన్డే స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), జి.కమలని(వికెట్ కీపర్), స్నేహ్ రానా, దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్, కష్వీ గౌతమ్, రేణుకా సింగ్, శ్రీచరణి, వైష్ణవీ శర్మ, క్రాంతి గౌడ్.
భారత టీ20 స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), జి.కమలని(వికెట్ కీపర్), జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, భారతి ఫుల్మాలి, శ్రేయాంక పాటిల్, స్నేహ్ రానా, శ్రీచరణి, వైష్ణవీ శర్మ, క్రాంతి గౌడ్.
Bharti fulmali 3️⃣6️⃣* runs in 1️⃣5️⃣ Balls #CricketTwitter I #WPL2026 I #MIvGG pic.twitter.com/ZDR34SWaKu
— Thewomencricketworld (@Thewomencricke1) January 13, 2026
ఆస్ట్రేలియా పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఏకైక టెస్టు ఆడనుంది టీమిండియా. ఫిబ్రవరి 15వ తేదిన తొలి టీ20తో సిరీస్ షురూ కానుంది. ఫిబ్రవరి 19న రెండో మ్యాచ్, ఫిబ్రవరి 21న మూడో మ్యాచ్‌తో పొట్టి సిరీస్ ముగుస్తుంది. అనంతరం.. మూడు రోజులకే .. ఫిబ్రవరి 24న బ్రిస్బేన్‌లో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27న హొబర్ట్లో రెండో వన్డే, మార్చి 1వ తేదీన చివరి మ్యాచ్ నిర్వహించనున్నారు. భారత జట్టుతో వన్డే సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగియనుంది.