Jannik Sinner | టురిన్ (ఇటలీ): టెన్నిస్ యువ సంచలనం జన్నిక్ సిన్నర్ మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టురిన్లో ఆదివారం జరిగిన ఏటీపీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిన్నర్ 6-4, 6-4తో టేలర్ ఫ్రిట్జ్ (యూఎస్ఏ)ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ టెన్నిస్‌లో సిన్నర్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు.
అతడు రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్)తో పాటు ఆరు ఏటీపీ టూర్ టైటిల్స్ గెలవడం విశేషం. ఇటలీ తరఫున గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన తొలి టెన్నిస్ ప్లేయర్‌గా సిన్నర్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం విదితమే. 2024లో 76 మ్యాచ్‌లు ఆడిన ఈ కుర్రాడు.. ఏకంగా 70 మ్యాచ్‌లలో గెలవడమే గాక ఈ ఏడాది ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకుతో సీజన్‌ను ముగించాడు.