మంగళూరు: మంగళూరు(కర్ణాటక) వేదికగా జరుగుతున్న 77వ జాతీయ సీనియర్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ రజత పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 400మీటర్ల ఫ్రీస్టయిల్ రేసులో వ్రితి 4:25:09 సెకన్ల టైమింగ్తో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించిన వ్రితి..అదే దూకుడు కొనసాగిస్తున్నది. ఇదే విభాగంలో పోటీపడ్డ హర్షిత రామచంద్ర(కర్ణాటక), భవ్య సచ్దేవ(ఢిల్లీ) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.