బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో ఇది వరకే స్వర్ణం గెలిచిన యువ షూటర్ ఇందర్‌సింగ్ సురుచి.. గురువారం సౌరభ్ చౌదరితో కలిసి రెండో పతకాన్ని కైవసం చేసుకుంది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భాగంగా జరిగిన కాంస్య పోరులో సురుచి, సౌరభ్ ద్వయం..
16-8తో భారత్‌కే చెందిన మను భాకర్, రవీందర్ సింగ్ జోడీని ఓడించి కాంస్యం సొంతం చేసుకుంది. చైనాకు స్వర్ణం, రజతం దక్కాయి. ఈ టోర్నీ లో భారత్‌కు ఇది ఎనిమిదో పతకం.