దోహ: ఆసియా రైజింగ్ స్టార్స్‌లో యువ భారత జట్టుకు చుక్కెదురైంది. లీగ్ దశలో భారత్.. పాకిస్థాన్ చేతిలో పరాభవం పాలై ఈ టోర్నీలో తొలి ఓటమిని ఎదుర్కుంది. మాజ్ సదాకత్ (79*) బ్యాట్‌తో పాటు బంతి (2/12) రాణించడంతో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం సాధించిన పాక్ ఏకపక్ష విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత్.. 19 ఓవర్లలో 136 రన్స్‌కే ఆలౌట్ అయింది. వైభవ్ సూర్యవంశీ (45), నమన్ ధీర్ (35) ధాటిగా ఆడినా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఛేదనను పాక్.. 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది.