గువాహటి: గువాహటి మాస్టర్స్ సూపర్-100 టోర్నీలో భారత యువ షట్లర్లు మిథున్ మంజునాథ్, శంకర్ సారస్వత్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శంకర్ సారస్వత్ 21-19, 21-9తో దెండి త్రియాన్సాపై అద్భుత విజయం సాధించాడు.
ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస గేముల్లో మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. మరో సెమీస్లో మిథున్ మంజునాథ్ 22-20, 21-8తో తుషార్ సువీర్పై గెలిచి టైటిల్ పోరులో నిలిచాడు. మహిళల సింగిల్స్ సెమీస్లో తన్విశర్మ 21-18, 21-16తో అకెచీపై గెలిచింది.