వాంటా: ఫిన్లాండ్లో జరుగుతున్న ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ అన్మోల్ ఖర్బ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో 18 ఏండ్ల అన్మోల్.. 21-15, 21-14తో అమేలి షూల్జ్ (డెన్మార్క్)ను చిత్తుచేసింది.
సూపర్ 500 టోర్నీలో సెమీస్‌కు చేరడం అన్మోల్కు ఇదే మొదటిసారి.