కౌలాలంపూర్: మలేషియా వేదికగా జరుగుతున్న ఏషియన్ స్కాష్ చాంపియన్‌షిప్‌లో భారత యువ ప్లేయర్ వెలావన్ సెంథిల్‌కుమార్ కాంస్య పతకంతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల వ్యక్తిగత సెమీఫైనల్ పోరులో 9-11, 11-13, 11-5, 6-11తో టాప్‌సీడ్ లు జు క్వాన్(హాంకాంగ్) చేతిలో ఓటమిపాలయ్యాడు. 65 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సెంథిల్ ప్రత్యర్థికి దీటైన పోటీనివ్వడంలో విఫలమయ్యాడు.