లిమా(పెరూ): ఐడబ్ల్యూఎఫ్ యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్ పర్వ్ చౌదరీ కాంస్య పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన బాలుర యూత్ 96కిలోల విభాగంలో బరిలోకి చౌదరీ.. స్నాచ్‌లో 140కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 175కిలోలు ఎత్తి మొత్తంగా 315కిలోలతో మూడో స్థానంలో నిలిచాడు.
టోర్నీలో భారత్‌కు ఇది మూడో పతకం. ఇప్పటికే జోష్న సాబర్ (40కి), హర్షవర్ధన్ సాహు (49కి) కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.