సైప్రస్: ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలి టైటిల్ చాంపియన్‌షిప్‌నకు మరింత చేరువైంది. శనివారం జరిగిన మహిళల 11వ రౌండ్లో వైశాలి 1-0 తేడాతో అలెగ్జాండ్రా గోర్శికినపై అద్భుత విజయం సాధించింది. తద్వారా ఇప్పటి వరకు ఏడు పాయింట్లతో వైశాలి అగ్రస్థానంలో కొనసాగుతున్నది. మరోవైపు దివ్యా దేశ్‌ముఖ్, జు జినర్ మధ్య గేమ్ 0.5-0.5తో డ్రాగా ముగిసింది. దివ్య ప్రస్తుతం 5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. పురుషుల విభాగంలో ప్రజ్ఞానంద…మతియస్ బ్లూబమ్తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.