ప్రేగ్: చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన ప్రేగ్ మాస్టర్స్ చెస్ చాంపియన్‌షిప్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన తొమ్మిదో రౌండ్ పోరులో ఈ చెన్నై కుర్రాడు.. చెక్కే చెందిన డేవిడ్ నవారాతో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. 9 రౌండ్లు ఉన్న ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన అరవింద్.. 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి చాంపియన్‌గా అవతరించాడు.
ఆడిన రెండు క్లాసికల్ సూపర్ టోర్నమెంట్లలో అరవింద్ రెండింట్లోనూ విజేతగా నిలవడం విశేషం. ఈ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగి ఏడో రౌండ్ వరకూ అరవింద్‌తో సమానంగా నిలిచిన మరో యువ భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద.. 5 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.