బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్లు సంజూ ఎమ్ఎస్, పవన్ బర్తాల్ ముందంజ వేశారు. శనివారం జరిగిన మహిళల 60కిలోల విభాగంలో బరిలోకి దిగిన సంజూ 5-0 తేడాతో సారి కొకుఫు(జపాన్)పై ఘన విజయం సాధించి క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది.
మరోవైపు పురుషుల 55కిలోల బౌట్లో ఆర్మీమెన్ పవన్ 4-1తో తనారత్ సెంగ్ఫెట్(థాయ్లాండ్)పై గెలిచి శుభారంభం చేశాడు. బాక్సింగ్ పవర్హౌజ్లుగా పేరు గాంచిన చైనా, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, దక్షిణకొరియా, థాయ్లాండ్ బరిలో ఉన్న ఈ టోర్నీలో భారత్ 19 మంది బృందంతో బరిలోకి దిగింది.