న్యూఢిల్లీ: ఆస్ట్రియన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ ప్రియాంక గోస్వామి పసిడి పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 10కి.మీల రేస్ వాక్‌ను ప్రియాంక 47నిమిషాల 54సెకన్ల వ్యవధిలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది.
తద్వారా ఈసీజన్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సరిగ్గా మూడేండ్ల క్రితం 10కి.మీల నడక రేసులో ప్రియాంక 45నిమిషాల 47సెకన్లతో తన అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసింది. గోస్వామి 10కి.మీలతో పాటు 20కి.మీల రేస్ వాక్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.