ప్లోవ్దివ్ (బల్గేరియా): యువ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో సత్తాచాటాడు. బల్గేరియా వేదికగా జరిగిన అండర్-21 రౌండ్ టేబుల్ ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన అర్జున్ రెండో స్థానంలో నిలిచాడు. తొమ్మిది రౌండ్లలో అజేయంగా నిలిచిన అర్జున్ మొత్తం ఏడు పాయింట్లు సాధించగా.. రష్యాకు చెందిన అలెక్సీ సరానా (7 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఇరువురి పాయింట్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు టై బ్రేకర్ నిర్వహించగా.. అందులో అర్జున్ వెనుకబడ్డాడు. భారత్‌కే చెందిన మాస్టర్ భరత్ సుబ్రమణ్యం, పురాణిక్, గుకేశ్ వరుసగా మూడో, నాలుగో, ఐదో స్థానాలు దక్కించుకున్నారు.