న్యూఢిల్లీ: భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యువ బ్యాటర్ పృథ్వీషా ఇంగ్లండ్ వన్డేకప్లో దుమ్మురేపుతున్నాడు. గత మ్యాచ్లో ద్విశతకంతో చెలరేగిన ఈ చిచ్చరపిడుగు తాజాగా మరో మెరుపు సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే కప్లో నార్తంప్టన్షైర్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీషా (76 బంతుల్లో 125 నాటౌట్; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) డర్హంతో మ్యాచ్లో అజేయ శతకంతో విజృంభించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన డర్హం జట్టు.. 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ కాగా.. పృథ్వీ మెరుపులతో నార్తంప్టన్షైర్ 25.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.