పారిస్: యువ బ్యాడ్మింటన్ తార ఉన్నతి హుడా బీడబ్ల్యూఎఫ్ ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్‌లో 18 ఏండ్ల ఉన్నతి.. 11-21, 21-13, 21-16తో లెశానా కరుపతెవన్ (మలేషియా)పై పోరాడి గెలిచింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి ద్వయం పోరు ముగియగా, అయూశ్ శెట్టి, అనుపమ తొలి రౌండ్లోనే ఓడారు.