భువనేశ్వర్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ అథ్లెట్లు అదరగొట్టారు. సోమవారం జరిగిన పురుషుల అండర్-20 3000మీటర్ల రేసును రాష్ట్ర యువ ప్లేయర్ 8:13:63 సెకన్లలో ముగించి పసిడి పతకంతో మెరిశాడు. ఇదే కేటగిరీలో రాహుల్‌కుమార్(చత్తీస్‌గఢ్), రుతిక్వర్మ(మహారాష్ట్ర) రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.
మరోవైపు బాలికల అండర్-18 హెప్టాథ్లాన్ ఫైనల్లో బి.వైశాలి రజత పతకంతో మెరిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన రేసులో ఏడు ఈవెంట్లలో వైశాలి అద్భుత ప్రదర్శన కనబరిచింది. తొలి రోజు జరిగిన నాలుగు ఈవెంట్లలో 2648 పాయింట్లు దక్కించుకున్న వైశాలి..మరో మూడు ఈవెంట్లలో 1829 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో నిలిచింది. నిరుపేద కుటంబానికి చెందిన వైశాలి..జాతీయ స్థాయిలో సత్తాచాటింది. ఇదే విభాగంలో సీమ, ముస్కాన్(హర్యానా) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.