బెంగళూరు: జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో యువ అథ్లెట్ మణికంఠ పసిడి వెలుగులు విరజిమ్మాడు. గురువారం జరిగిన పురుషుల 100మీ టర్ల రేసును 10.42 సెకన్లలో ముగించిన మణికంఠ టాప్‌లో నిలిచాడు. అంతకు ముందు జరిగిన ట్రయల్స్‌లో 10.23 సెకన్ల టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పిన మణికంఠ తుది పోరులోనూ సత్తాచాటాడు.
నిఖిల్ పాటిల్ (10.69సె), శివ (10.70సె) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల 100మీటర్ల పరుగులో గిరిధారిణి రవికుమార్ 11.36 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానం సొంతం చేసుకుంది. స్నేహ (11.42సె), కమల్జీత్కౌర్ (11.52సె) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. పురుషుల 110మీటర్ల హర్డిల్స్‌లో తేజాస్ స్వర్ణం సొంతం చేసుకున్నాడు.