లండన్: మానసిక సమస్యలను కారణంగా చూపుతూ అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ ఒలింపిక్స్ ఆల్-అరౌండ్ ఫైనల్ నుంచి తప్పుకున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా తాను ట్విస్టీస్తో బాధపడుతున్నట్లు కూడా ఆమె చెప్పడం ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగంలో చర్చనీయాంశమైంది. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు చాలా మంది అండగా నిలుస్తున్నారు. తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా సిమోన్ బైల్స్కు మద్దతుగా ట్వీట్ చేశాడు. ఈ సమస్యలతోనే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ల నుంచి తప్పుకున్న టెన్నిస్ ప్లేయర్ నవోమి ఒసాకాకు కూడా రవిశాస్త్రి మద్దతు ప్రకటించాడు. నీకు కావాల్సినంత టైమ్ తీసుకో సిమోన్ బైల్స్. 48 గంటలు కాకపోతే 48 రోజులైనా సరే. నువ్వు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒసాకా నువ్వు కూడా అంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.
Take your time @Simone_Biles. You have earned the right to owe it to yourself at this tender age. 48 hours or 48 days it might take. Just do it Champion. You owe no explanation to no one. @naomiosaka, you too. God bless you girls #Olympics pic.twitter.com/wMS7eV1UlX
— Ravi Shastri (@RaviShastriOfc) July 29, 2021