అడిలైడ్: అడిలైడ్‌లో జరుగుతున్న (Adelaide Test) రెండో టెస్ట్‌లోనూ విజయంతో సిరీస్‌పై పట్టు సాధించాలన్న టీమ్ఇండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. మంచి ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ డకౌటయ్యాడు. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో పెర్త్ టెస్ట్ విన్లో కీలక పాత్ర పోషించిన ఓపెనింగ్ జోడీ జైస్వాల్, రాహుల్ జంటను మళ్లీ రంగంలోకి దింపింది. అయితే తానాడిన ఫస్ట్ బాల్కే వికెట్ సమర్పించుకున్నాడు.
మిచెల్ స్టార్క్‌కు వికెట్ల ముందు దొరికి డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో మొదటి ఓవర్లోనే శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అయితే వచ్చీ రాగానే తన బ్యాట్‌కు పనిచెప్పాడు గిల్. రెండు ఫోర్లు కొట్టి 7 బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఇక కొత్త ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నాడు. 6 బాల్‌లు ఎదుర్కొన్నప్పటీకి పరుగుల ఖాతా ఇంకా తెరవలేదు. ప్రస్తుతం 2.3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 10 రన్స్ చేసింది.
భారత రాజ్యాంగ ప్రదాత, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
2ND Test. WICKET! 0.1: Yashasvi Jaiswal 0(1) lbw Mitchell Starc, India 0/1 https://t.co/upjirQCmiV #AUSvIND
— BCCI (@BCCI) December 6, 2024